మీరు రియల్ క్రికెట్ ఫ్యానా? అయితే Realme 3 Pro ఉచితంగా గెలుచుకోవచ్చు.

Updated on 27-Jun-2019
HIGHLIGHTS

త్యంత వేగవంతమైన బంతిని ఎవరు విసురుతారో ముందుగా ఊహించి చెప్పినవారికి Realme 3 Pro స్మార్ట్ ఫోన్ను బహుమతిగా అందించనుంది.

యువతను మరియు తన అభిమానులను ఆకట్టుకోవడంలో అందరికంటే Realme సంస్థ ముందుగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సంస్థ, ఇప్పుడు సరికొత్తగా ఇండియన్ క్రికెట్ అభిమానులకోసం ఒక కాంటెస్ట్ ను ప్రకటించింది. దీని గురించిన వివరాలతో తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ ను అందించింది. ఈ పోస్ట్ ప్రకారం, ఈ రోజు ICC వరల్డ్ కప్ లో ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన బంతిని ఎవరు విసురుతారో ముందుగా ఊహించి చెప్పినవారికి Realme 3 Pro స్మార్ట్ ఫోన్ను బహుమతిగా అందించనుంది.

ఈ మాట నిజంగా క్రికెట్ అభిమానులను కేరింతలు పెట్టిస్తుంది. అంతేకాదు, ఇండియా యొక్క ప్రతి మ్యాచ్ మొదలవడాని కంటే  ముందుగానే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఎవరో ఊహించి చెప్పిన వారికీ కూడా Realme 3 Pro స్మార్ట్ ఫోన్ను బహుమతిగా అందించనుంది. అయితే, దీని సంభందించి కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఈ క్రింద రియల్ మీ కాంటెస్ట్ లో ఎలా పాల్గొనాలో తెలియపరిచాను.

ఈ కాంటెస్ట్ లో పాల్గొనడానికి ఈ క్రింది విషయాలు పాటించాలి.

1. మీరు కచ్చితంగా రియల్మీ యొక్క Facebook/Twitter Handle/ Instagram Account ని ఫాలో చేయాలి

2. రియల్ క్రికెట్ ఫ్యాన్ ప్రశ్నకు మీరు రియల్మీ ఫేస్ బుక్ పేజీలో మీ సమాధానాన్ని కమెంట్ ద్వారా తెలియచేయాలి

3. రియల్ క్రికెట్ ఫ్యాన్ ప్రశ్నకు మీరు రియల్మీ ట్విట్టర్ పేజీలో మీ సమాధానాన్నిReply ద్వారా తెలియచేయాలి

4. రియల్ క్రికెట్ ఫ్యాన్ ప్రశ్నకు మీరు రియల్మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజీలో మీ సమాధానాన్నిDM ద్వారా తెలియచేయాలి

5. మీరు తెలియ చేసే సమాధాన్ని సరైన #TheRealCricketFan హ్యాష్ ని ఉపయోగించాలి

6. కంపెనీ యొక్క అన్ని ప్లాట్ఫారమ్ల నుండి వచ్చిన వాటిలో వేకువ సరైన సమాధానాలు చెప్పిన ఒక్కరిని మాత్రమే విజేతగా ప్రకటిస్తారు.    

 

https://twitter.com/realmemobiles/status/1144135154597863424?ref_src=twsrc%5Etfw

 

                                 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :