Apple Stores వద్ద బారులు తీరిన ఐఫోన్ అభిమానులు .. అయితే, ఇంట్లో కూర్చొని కొత్త iPhone 18 Pro ఐఫోన్ ఇలా అందుకోవచ్చు.!

HIGHLIGHTS

Apple iPhone 18 Pro మరియు ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది

ఈ కొత్త ఐఫోన్‌ చేజిక్కించుకోవడానికి దేశంలో ఉన్న ఆపిల్ స్టోర్ బయట బారులు తీరి ఎదురు చూస్తున్నారు

జస్ట్ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కొత్త ఐఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు

Apple iPhone 18 Pro మరియు ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఈరోజు నుంచి భారతదేశంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఆపిల్ ఐఫోన్ అభిమానులు ఈ కొత్త ఐఫోన్‌ చేజిక్కించుకోవడానికి దేశంలో ఉన్న ఆపిల్ స్టోర్ బయట బారులు తీరి ఎదురు చూస్తున్నారు. అయితే, ఇంట్లో కూర్చొని కొత్త ఐఫోన్ ను పొందడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఈ మార్గంతో మీరు లాంగ్ క్యూలలో కాళ్ళు నొప్పులు వచ్చేలా నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కొత్త ఐఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 18 Pro ఇంట్లో కూర్చొని ఎలా అందుకోవాలి?

యాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మరియు ఐఫోన్ 18 ప్రో స్మార్ట్ ఫోన్ లను బ్లింకిట్ మరియు జెప్టో రెండు క్విక్ కామర్స్ ప్లాట్‌ ఫారమ్‌ లు డెలివరీ చేస్తున్నాయి. మరింత సౌకర్యమైన విషయం ఏమిటంటే, ఈ రెండు ప్రో మోడళ్లను కేవలం కొన్ని నిమిషాల్లో మీకు అందిస్తాయి. అంటే, జస్ట్ మీరు కొత్త ఐఫోన్ ను కొనుగోలు చేసిన కొన్ని నిముషాల్లో ఫోన్ మీ చేతుల్లో ఉంటుంది.

Also Read: AI Phone అండర్ రూ. 20,000: నిజంగా AI ఉపయోగకరమేనా లేక మార్కెటింగ్ జిమ్మిక్కా!

Apple iPhone 18 Pro : ధర

యాపిల్ ఐఫోన్ 18 ప్రో (256GB) ధర : రూ. 1,64,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (512GB) ధర : రూ. 1,89,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (1TB) ధర : రూ. 2,39,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (2TB) ధర : రూ. 3,14,900

Apple iPhone 18 Pro Max Price

యాపిల్ ఐఫోన్ 18 ప్రో (256GB) ధర : రూ. 1,79,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (512GB) ధర : రూ. 2,04,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (1TB) ధర : రూ. 2,54,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (2TB) ధర : రూ. 3,29,900
ఆఫర్స్

ఐఫోన్ 18 ప్రో మరియు ఐఫోన్ 18 ప్రో మాక్స్ పై Blinkit రూ. 7,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ ను అందిస్తోంది. Axis Bank, ICICI Bank మరియు SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్ ను తీసుకునే వారికీ ఈ ఆఫర్ లభిస్తుంది.

కొత్త ఐఫోన్ మోడళ్లపై Zepto కూడా రూ. 7,000 వరకు తక్షణ తగ్గింపు (instant discount) ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన Axis Bank, ICICI Bank మరియు SBI క్రెడిట్ కార్డ్‌లకు వర్తిస్తుంది.

కాబట్టి, ఇంట్లో కూర్చొని ఫోన్ అందుకోవడం మాత్రమే కాదు, ఈ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ ని కూడా మీరు ఇంట్లో కూర్చొని అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :