Apple iPhone 17 సిరీస్ కొత్త ఫోన్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

Apple iPhone 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లు గత వారం ప్రకటించబడ్డాయి

ఈ సిరీస్ నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మరియు ఐఫోన్ ఎయిర్ ఫోన్లు అందించింది

ఈ సిరీస్ నుంచి అందించిన కొత్త ఫోన్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది

Apple iPhone 17 సిరీస్ కొత్త ఫోన్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Apple iPhone 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లు గత వారం ప్రకటించబడ్డాయి. ఈ సిరీస్ నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మరియు ఐఫోన్ ఎయిర్ ఫోన్లు అందించింది. ఈ సిరీస్ నుంచి అందించిన కొత్త ఫోన్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఆపిల్ ఐఫోన్ సిరీస్ నుంచి ఒక ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ఫోన్స్ ధర మరియు ఫీచర్స్ ఇక్కడ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple iPhone 17 సిరీస్ ధర వివరాలు

ఆపిల్ ఐఫోన్ 17

సిరీస్ నుండి అందించిన నాలుగు ఫోన్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 17

ఐఫోన్ 17 (256 GB) ధర : రూ. 82,900

ఐఫోన్ 17 (512 GB) ధర : రూ. 1,02,900

ఐఫోన్ ఎయిర్

ఐఫోన్ ఎయిర్ (256GB) ధర : రూ. 1,19,900

ఐఫోన్ ఎయిర్ (512GB) ధర : రూ. 1,39,900

ఐఫోన్ ఎయిర్ (1TB) ధర : రూ. 1,59,900

ఐఫోన్ 17 ప్రో

ఐఫోన్ 17 ప్రో (256GB) ధర : రూ. 1,34,900

ఐఫోన్ 17 ప్రో (512GB) ధర : రూ. 1,54,900

ఐఫోన్ 17 ప్రో (1TB) ధర : రూ. 1,74,900

ఐఫోన్ 17 ప్రో మాక్స్

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB) ధర : రూ. 1,49,900

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (512GB) ధర : రూ. 1,69,900

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (1TB) ధర : రూ. 1,89,900

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (2TB) ధర : రూ. 2,29,900

ఈ ఫోన్స్ గొప్ప ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తోంది.

Also Read: Nothing OS 4.0: నథింగ్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. Android 16 టీజర్ వచ్చేసింది.!

Apple iPhone 17 : ఫీచర్స్

ఆపిల్ ఐఫోన్ 17 ఫోన్ 6.3 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రో మోషన్ టెక్నాలజీ, ఆల్ వేస్ ఆన్ డిస్ప్లే మరియు డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టైటానియం ఫ్రేమ్ మరియు సిరామిక్ గ్లాస్ తో చాలా గట్టి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో కెమెరా కంట్రోల్ కోసం యాక్షన్ బటన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను ఆపిల్ యొక్క లేటెస్ట్ A19 Pro చిప్ తో అందించింది. ఈ ఫోన్ 256 జీబీ మరియు 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Apple iPhone 17

ఈ ఫోన్ లో వెనుక 48MP + 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా మరియు ముందు 18MP సెల్ఫీ కెమెరా కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియోలను 60FPS వద్ద అందిస్తుంది. ఇది కాకుండా టన్నుల కొద్దీ ఆపిల్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5x ఆప్టికల్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 30 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే బిగ్ బ్యాటరీ మరియు USB‑C ఛార్జ్ సపోర్ట్ ని అందించింది. ఈ ఫోన్ ఎమర్జెన్సీ SOS, క్రాష్ డిటెక్షన్ మరియు Apple Intelligence Footnote సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo