జియో ఫోన్ 2 కొనడానికి మరొక ఛాన్స్ : ఈ రోజు మరొక ప్లాష్ సేల్

HIGHLIGHTS

బెస్ట్ ఫిచర్ ఫోనుగా గుర్తింపు పొందిన ఏ ఫోన్ మరొక సేల్ ఈరోజు జరగనుంది.

జియో తన వినియోగదారులకి మంచి ప్రయోజానాలతో  పాటుగా మంచి ఫీచర్లతో అందించినటువంటి జియో ఫోన్ 2 ఇప్పటివరకు వచ్చిన ఫీచర్ ఫోన్లలో ఉత్తమమైందిగా నిలిచింది. ఇప్పటివరకు జరిగిన అమ్మకాలలో కూడా అత్యధికమైన అమ్మకాలను సాధించిన ఈ ఫోను యొక్క మరొక ఫ్లాష్ సేల్ ను జియో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించనుంది. కొనాలనుకునే వారు jio.com లేదా my jio నుండి ఈ ఫోన్ కొనుగోలుకే చెయ్యవచు.           

జియోఫోన్ 2 స్పెషిఫికేషన్స్ మరియు ఫీచర్స్

జియోఫోన్ 2 లో గుర్తించదగిన మార్పులలో ఒకటిగా QWERTY కీబోర్డుగా చెప్పవచ్చు, ఇది నాలుగు-మార్గాల నావిగేషన్ కీతో ఉంటుంది, ఇది పాత బ్లాక్ బెర్రీ ఫోన్లను మనకు గుర్తుకు  తెస్తుంది.  ఈ డివైజ్ క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతును అందిస్తుంది. అయితే ఇందులో 4జి  వోల్టి(voLTE) స్లాట్ లో జియో ని మాత్రమే వాడుకునే వీలుతో పాటు 2జి స్లాట్ తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ ఫోన్ 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2ఎంపీ రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.

కనెక్టవిటీ విషయానికి వస్తే , వోల్టి(voLTE)  కు మద్దతు ఇస్తుంది, అయితే, ఇది VoWiFi కు మద్దతు ఇస్తుంది మరియు మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టికాస్ట్ సర్వీస్ (eMBMS) ను కూడా అభివృద్ధి చేస్తుంది. ఫోన్ NFC, Wi-Fi కనెక్టివిటీ, బ్లూటూత్ తక్కువ శక్తికి కూడా మద్దతు ఇస్తుంది మరియు దీనిలో FM రేడియో అంతర్నిర్మితంగా ఉంటుంది.

యాప్స్ మద్దతు గురించి చూస్తే , ఈ జీయోఫోన్ 2 అన్ని జియో యాప్స్ కి మద్దతిస్తుంది:మై జియో, జియో మ్యూజిక్,  జియో సినిమా,జియో ఎక్సప్రెస్ న్యూస్, వాయిస్ అసిస్టెంట్,జియో వీడియో కాల్, జియో గేమ్స్ లాంటివి. ఇంకా కావాల్సిన పేస్ బుక్యా, యు ట్యూబ్,మరియు వాట్సాప్  వంటివాటిని జియో స్టోర్ నుండి పొందేవీలుంది.

జియోఫోన్ 2 ప్లాన్స్

రిలయన్స్ జీయో నుంచి మూడు పథకాలతో జియోఫోన్ 2 ని జతచేసారు. రూ . 48 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత అపరిమిత కాలింగ్ మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. ఇంకా  రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది. చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటు తో  అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :