షావోమి నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ : జూలై 4 న లాంచ్ కానుంది

HIGHLIGHTS

'Smart Deah ka Smartphone' అనే క్యాప్షన్ తో ఈ స్మార్ట్ ఫోన్ను గురించిన వివరాలను అందిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో జూలై 4 వ తేదీన విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్లు ప్రకటించింది.

షావోమి సంస్థ, భారతీయ వినియోగదారుల యొక్క అవసరాలకు తగిన మరియు అతితక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చే వాటిలో ముందు వరసలో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సమవత్సరంలో, ఇప్పటివరకూ అనేక ప్రత్యేకతలతో బడ్జెట్ ధరలో పెద్ద కెమేరాతో మరియు మంచి ప్రాసెసర్ మరియు గొప్ప సెల్ఫీ కెమెరా వంటి అనేకరకాలైన ప్రత్యేకతలతో, అనేకరకాల స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది.

అయితే, ఇప్పుడు తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకురానున్నట్లు టీజ్ చేస్తోంది. ఈ టీజింగ్ ప్రకారం, 'Smart Deah ka Smartphone' అనే క్యాప్షన్ తో ఈ స్మార్ట్ ఫోన్ను గురించిన వివరాలను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో జూలై 4 వ తేదీన విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్లు ప్రకటించింది.

ఇక కొత్తగా రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించిన వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్ను పెద్ద మరియు ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, వినియోగధారులను ఆకట్టుకునేలా  ఉండే కెమేరా మరియు వేగవంతమైన ప్రాసెసర్ వంటి గొప్ప ఫీచర్లతో తీసుకురానున్నట్లు చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్, ఇన్ని ప్రత్యేకతలు కలిగివున్నా కూడా ధర మాత్రం చౌకగానే ఉండనున్నట్లు అంచనాలు వేస్తున్నారు.                            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :