Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ సేల్ లాస్ట్ డే బిగ్ డీల్ అందుకోండి.!

HIGHLIGHTS

Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ సేల్ లాస్ట్ డే జబర్దస్త్ డీల్ అందించింది

ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ మూడు గొప్ప డీల్స్ అందించింది

శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ అందుకునే అవకాశం అమెజాన్ సేల్ ఈరోజు అందించింది

Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ సేల్ లాస్ట్ డే జబర్దస్త్ డీల్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ మూడు గొప్ప డీల్స్ అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ అందుకునే అవకాశం అమెజాన్ సేల్ ఈరోజు అందించింది. అయితే, ఈ ఛాన్స్ మీకు రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ సేల్ లాస్ట్ డేస్ లో అందించిన ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Samsung Galaxy Z Fold 6: ఆఫర్

శాంసంగ్ భారత్ మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 పై అమెజాన్ మూడు బిగ్ డీల్స్ అందించింది. రేపటితో ముగినున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సెల్ నుంచి అందించింది. అంటే ఈ ఆఫర్ మీకు ఈరోజు మరియు రేపు రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 2024 లో ఇండియన్ మార్కెట్లో రూ. 1,64,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ అందించిన 33% భారీ డిస్కౌంట్ తో రూ. 1,09,999 ధరతో లిస్ట్ అయ్యింది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 5,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 1,04,999 రూపాయల ప్రైస్ తో మీకు లభిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ పై అందించిన No Cost EMI ఆఫర్ తో ఈ ఫోన్ పై రూ. 9,493 వడ్డీ కట్టే పనిలేకుండా ఈ ఫోన్ ను పొందే అవకాశం కూడా అందించింది.ఈ మూడు లాభాలతో ఈ ఫోన్ మీకు లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి కేవలం 14 వేల ధరలో లభిస్తోంది.!

Samsung Galaxy Z Fold 6: ఫీచర్స్

ఈ ఫోన్ QXGA +రిజల్యూషన్ కలిగిన 7.6 అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.3-అంగుళాల డైనమిక్ AMOLED 2X కవర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ స్క్రీన్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు డిస్‌ప్లేలు కూడా స్మూత్ స్క్రోల్ మరియు మంచి విజువల్స్ అందిస్తాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఫోల్డ్ ఫోన్ 50 MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 10 MP కవర్ కెమెరా మరియు 4MP అండర్ డిస్ప్లే కెమెరా కూడా వు ఉంటుంది. ఇది సూపర్ రిజల్యూషన్ ఇమేజెస్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 4,400 mAh బ్యాటరీ మరియు 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 మరియు వైర్లెస్ షేర్ సపోర్ట్ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ఆర్మర్ అల్యూమినియం బాడీ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ సెటప్ తో ఉంటాయి. ఈ ఫాలెన్ IP48 రేటింగ్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :