ఈరోజు 22 వేల భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న Samsung ప్రీమియం ఫోన్.!

HIGHLIGHTS

30 వేల బడ్జెట్ లో ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ గుడ్ న్యూస్

Samsung ప్రీమియం ఫోన్ ను Amazon ఈరోజు 22 వేల భారీ డిస్కౌంట్ తో 27 వేలకే ఆఫర్ చేస్తోంది

ఈ ఫోన్ ఇండియాలో రూ. 49,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేయబడింది

ఈరోజు 22 వేల భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న Samsung ప్రీమియం ఫోన్.!

30 వేల బడ్జెట్ లో ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందించింది అమెజాన్. Samsung ప్రీమియం ఫోన్ ను ఈరోజు 22 వేల భారీ డిస్కౌంట్ తో 27 వేలకే ఆఫర్ చేస్తోంది. ఇండియాలో రూ. 49,999 ధరలో విడుదలైన ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 ధరకే పొందవచ్చు. మరి అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ ఆఫర్ వివరాలు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా Samsung ప్రీమియం ఫోన్ ఆఫర్?

ప్రీమియం ఫీచర్స్ తో గత సంవత్సరం శామ్సంగ్ విడుదల చేసిన Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు 22 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 27,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఇండియాలో రూ. 49,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేయబడింది మరియు ఈరోజు చాలా సరసమైన ధరలో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది.

ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ను ఆఫర్ ధరకు కొనుగోలు చేయదలచిన వారు By From Here పైన నొక్కండి.

Also Read: గుడ్ న్యూస్: Amazon Great Freedom Festival సేల్ భారీ ఆఫర్లతో వచ్చేస్తోంది.!

Samsung Galaxy S21 FE 5G : ఫీచర్స్

శామ్సంగ్ యొక్క ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 888 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. జతగా ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Samsung Galaxy S21 FE 5G

ఈ ఫోన్ లో వెనుక శామ్సంగ్ ప్రీమియం కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో వెనుక 12MP (Dual Pixel AF & OIS) మెయిన్ + 12MP అల్ట్రా వైడ్ + 3x ఆప్టిక్ జూమ్ సపోర్ట్ కలిగిన 8MP టెలీఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. అలాగే, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ AKG స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు Dolby Atmos సపోర్ట్ తో కూడా వస్తుంది.

ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4500 mAh బిగ్ బ్యాటరీ వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo