Xiaomi 11T Pro పైన భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్..!!

HIGHLIGHTS

షియోమీ 11T ప్రో పైన అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది

11T Pro ఫోన్ ను అమెజాన్ నుండి ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే పొందవచ్చు

అత్యంత వేగవంతమైన 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

Xiaomi 11T Pro పైన భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్..!!

ఇటీవల భారీ ఫీచర్లతో Xiaomi ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ షియోమీ 11T ప్రో పైన అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. అత్యంత వేగవంతమైన 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ను అమెజాన్ నుండి ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. ఈ ఫోన్ యొక్క ధర, అఫర్స్ మరియు స్పెక్స్ క్రింద చూడవచ్చు.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 11T Pro: ధర 

Xiaomi 11T Pro స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో రూ. 38,999 ధరతో లభిస్తోంది. మరొక వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ధర రూ. 40,999 కాగా, 12GBర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999.

ఆఫర్లు : Buy From Here

ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పైన అమెజాన్ 1,000 రూపాయల కూపన్ అఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 4,500 రూపాయలు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.అలాగే, Citi బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయలు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది     

Xiaomi 11T Pro: స్పెక్స్

షియోమి 11T ప్రో 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ అందిస్తుంది. ఈ ఫోన్ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ ని వుంది. ఇది డస్ట్ మరియు నీటి తుంపరల నుండి రక్షణ కలిగిన IP53 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు MIUI 12.5  యొక్క తాజా వెర్షన్‌లో రన్ అవుతుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో, 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 8K UHD లో వీడియోలను 30fps వరకూ రికార్డ్ చేయగలవని కంపెనీ తెలిపింది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్లను అందించింది. షియోమి 11T ప్రో స్మార్ట్ ఫోన్ 120W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 17 నిముషాల్లోనే 100% ఛార్జింగ్ అవుతుందని షియోమి తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo