వన్ ప్లస్ రీసెంట్ గా విడుదల చేసిన OnePlus 12R స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ జబర్దస్త్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ పైన డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ మూడు ఆఫర్లు ప్రకటించింది. అందుకే, ఈరోజు ఈ వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus 12R: ఆఫర్స్
వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను ఈరోజు అమెజాన్ రూ. 39,998 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ ను కూడా జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా జత చేసింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ను అందుకోవాలంటే, HDFC లేదా IDFC లేదా OneCard లేదా BOBCARD క్రెడిట్ కార్డు లతో ఈ ఫోన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. Buy From here
వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వున్నాయి. ఇది మాత్రమే కాదు ఇందులో RAM-Vita మరియు డ్యూయల్ క్రయో-వెలాసిటీ VC కూడా వుంది. ఈ ఫోన్ లో ఆక్వా టచ్ సపోర్ట్ కలిగిన 1.5K LTPO Pro XDR డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision సపోర్ట్ తో ఉంటుంది మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది.
OnePlus 12R
ఈ వన్ ప్లస్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ కెమెరా సెటప్ లో 50MP Sony IMX890 మెయిన్ మరియు Sony IMX355 అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉన్నాయి. ఈ కెమెరాతో గొప్ప ఫోటోలు మరియు 4K వీడియోలను పొందవచ్చు. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 OS పై నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile