Lava Agni 2 5G పైన భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon.!
లావా అగ్ని 2 5జి ఈ ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే లభిస్తుంది
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ పైన Amazon భారీ ఆఫర్లను ప్రకటించింది
ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం అమేజాన్ అందించింది
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ పైన Amazon భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రముఖ భారతీయ మొబైల్ కంపెనీ లావా బడ్జెట్ ధరలో కర్వ్డ్ డిస్ప్లేతో తీసుకు వచ్చిన మొదటి ఫోన్ లావా అగ్ని 2 5జి ఈ ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. 5జి ప్రోసెసర్, మంచి కెమేరా సెటప్ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం అమేజాన్ అందించింది.
SurveyAmazon Offers Lava Agni 2 5G
లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను అమేజాన్ ఈరోజు రూ. 19,999 రేటుతో లిస్టింగ్ చేసింది. ఈ లావా ఫోన్ పైన రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ కూపన్ ను ఈరోజు అమేజాన్ అందించింది. ఈ కూపన్ ద్వారా ఈ లావా ఫోన్ ను రూ. 18,499 రూపాయలకే పొందవచ్చు. OneCard Credit Card EMI ఆఫర్ తో ఈ ఫోన్ కోన్ వారికి రూ. 1,200 రూపాయల డిస్కౌంట్, Amex Credit Card EMI తో ఈ ఫోన్ కోన్ వారికి రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత చవక ధరకే లభిస్తుంది.
Also Read: boAt: చవక ధరకే 45 గంటలు ప్లేటైమ్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన బోట్.!
లావా అగ్ని 2 5జి స్పెక్స్ & ఫీచర్స్
లావా అగ్ని 2 5జి ఇండియాలో Dimensity 7050 ప్రోసెసర్ తో వచ్చిన మొదటి ఫోన్. ఇది 8GB RAM + 8GB వర్చువల్ ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 120 Hz రిఫ్రెష్ రేట్ 6.78 ఇంచ్ Curved AMOLED డిస్ప్లేని ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించింది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ లేని Clean Android 13 OS తో పని చేస్తుంది.

ఈ ఫోన్లో వెనుక 50MP+ 8MP + 2MP + 2MP క్వాడ్ కెమేరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ లావా ఫోన్ లో 4700mAh బ్యాటరీని 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile