boAt: చవక ధరకే 45 గంటలు ప్లేటైమ్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన బోట్.!

HIGHLIGHTS

boAt శరవేగంగా కొత్త ప్రోడక్ట్స్ ను భారత మార్కెట్ లో లాంచ్ చేస్తోంది

బోట్ Airdops 91 పేరుతో కొత్త TWS ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది

ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ 45 గంటలు ప్లేటైమ్ అందిస్తాయి

boAt: చవక ధరకే 45 గంటలు ప్లేటైమ్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన బోట్.!

దేశీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ boAt శరవేగంగా కొత్త ప్రోడక్ట్స్ ను భారత మార్కెట్ లో లాంచ్ చేస్తోంది. రీసెంట్ గా eSIM తో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసిన బోట్, ఇప్పుడు కొత్త TWS ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. బోట్ Airdops 91 పేరుతో తీసుకు వచ్చిన ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ 45 గంటలు ప్లేటైమ్ అందిస్తాయి. అంతేకాదు, ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ టెక్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నట్లు బోట్ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt Airdopes 91 Price

బోట్ ఎయిర్ డోప్స్ TWS ఇయర్ బడ్స్ ను రూ. 999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఇయర్ బడ్స్ ను మరింత డిస్కౌంట్ తో కేవలం రూ. 899 రూపాయలకే అమేజాన్ నుండి లభిస్తోంది. ఈ కొత్త ఇయర్ బడ్స్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు ఈ క్రింద చూడవచ్చు. అమేజాన్ నుండి ఈ బడ్స్ కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: Airtel Best Plan: రూ. 1799 ఖర్చుతోనే 365 రోజులు లాభాలను అందుకోండి.!

బోట్ ఎయిర్ డోప్స్ TWS ప్రత్యేకతలు

బోట్ ఎయిర్ డోప్స్ TWS ఇయర్ బడ్స్ బాక్స్ తో కలిపి టోటల్ 45 hrs Playtime అందించ గల శక్తితో వస్తుంది. ఈ బడ్స్ లో అందించిన ASAP Charge టెక్ తో చాలా వేగంగా ఛార్జ్ కూడా అవుతుంది. ఈ బడ్స్ ను 10 mm స్పీకర్లతో boAt Signature Sound తో అందించినట్లు బోట్ తెలిపింది. ఈ బోట్ ఇయర్ బడ్స్ BEAST మోడ్ తో 50 ms లో లెటెన్సీ తో జాప్యం లేని గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

boAt launches Airdopes 91

ఈ కొత్త బడ్స్ ను Dual Mics with ENx Tech తో బోట్ తీసుకు వచ్చింది. ఈ టెక్ తో నోయిస్-ఫ్రీ కాలింగ్ అనుభవాన్ని పొందే వీలుంది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను Bluetooth v5.3 సపోర్ట్ మరియు Insta Wake N’Pair ఫి ఫీచర్ తో కూడా తీసుకు వచ్చింది. ఈ బడ్స్ IPX4 స్వెట్ & వాటర్ రెసిస్టెంట్ మరియు IWP టెక్నలాజి వంటి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo