OnePlus Nord 4 5G పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
OnePlus Nord 4 5G పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది
న్ ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ నుంచి ఈ భారీ ఆఫర్లు ప్రకటించింది
ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్ తో చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు
OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ లేటెస్ట్ గా తీసుకువచ్చిన వన్ ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ నుంచి ఈ భారీ ఆఫర్లు ప్రకటించింది. పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చిన ఈ ఫోన్ ను ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్ తో చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
SurveyOnePlus Nord 4 5G : ఆఫర్
వన్ ప్లస్ నార్డ్ 4 5జి స్మార్ట్ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ భారత మార్కెట్లో రూ. 32,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ వన్ ప్లస్ రెడ్ రష్ డే సేల్ నుంచి రూ. 3,000 డిస్కౌంట్ తో రూ. 28,998 రూపాయల ధరకే లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
అమెజాన్ వన్ ప్లస్ రెడ్ రష్ డే సేల్ నుంచి వన్ ప్లస్ నార్డ్ 4 5జి ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 24,998 రూపాయల అతి తక్కువ రేటుకే సొంతం చేసుకోవచ్చు. Buy From Here
Also Read: Airtel యూజర్లకు Jio Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
OnePlus Nord 4 5G : ఫీచర్స్
వన్ ప్లస్ ఈ ఫోన్ ప్రీమియం క్వాల్కమ్ చిప్ సెట్ Snapdragon 7+ Gen 3 తో అందించింది. ఈ ఫోన్ లో 8GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.5M కంటే అధికమైన AnTuTu స్కోర్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల మేజర్ OS అప్డేట్స్ ను కూడా అందుకుంది.

ఈ వన్ ప్లస్ ఫోన్ 50MP (Sony) + 8MP (Sony) అల్ట్రా వైడ్ సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా మరియు 16 MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60fps తో 4K రికార్డింగ్ సపోర్ట్, AI Camera ఫీచర్స్ మరియు గొప్ప జూమ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 100W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile