ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తున్న ఐకూ ప్రీమియం 5G ఫోన్.!

ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తున్న ఐకూ ప్రీమియం 5G ఫోన్.!
HIGHLIGHTS

అమెజాన్ స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ డేస్ సేల్ బెస్ట్ 5G మొబైల్ డీల్

ఈ అమెజాన్ సేల్ జనవరి 21 నుండి జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుంది

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది

IQOO యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ IQOO 7 5G అమెజాన్ స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అమెజాన్ సేల్ జనవరి 21 నుండి జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన డిస్కౌంట్ తో పాటుగా అతితక్కువ EMI తో కొనుగోలు చేసే అప్షన్ కూడా అమెజాన్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డీల్ మరియు ఫోన్ టాప్ ఫీచర్లను గురించి తెలుసుకోండి.  

IQOO 7 5G : అఫర్ ధర 

IQOO 7 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8జీబీ + 128 జీబీ ) రూ.31,990 ధరతో లాంచ్ చేయబడింది. అయితే, ఈ అమెజాన్ సేల్ నుండి 7,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.24,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ పే లెటర్ లేదా డెబిట్ కార్డ్ EMI అప్షన్ ద్వారా అతి తక్కువ EMI తో కొనుగోలు చేసే అవకాశం కూడా వుంది. Buy From here     

IQOO 7 5G : టాప్- ఫీచర్లు  

 Display

IQOO 7 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.62 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 300Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్యలో పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ డిస్ప్లే ఇప్పటి వరకూ ఏ స్మార్ట్ ఫోన్ కు లేని విధంగా ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ తో వస్తుంది మరియు గరిష్టంగా 1300 నైట్స్ బ్రైట్నెస్ అందించగలదు.

Performance

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 2- లైన్ స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది Funtouch OS 11.1 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే కోసం అధనపు చిప్ సెట్ తో అవస్తుంది. ఈ విధంగా వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ గా IQOO 7 5G నిలుస్తుంది. 

Camera

కెమెరాల విషయంలో, IQOO 7 5G వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. కానీ, క్వాడ్ కెమెరా లాగా పనిచేస్తుంది మరియు ఈ కెమెరాలు అద్భుతమైన పనితనాన్ని అందించగలవు. దీనిలో, ప్రధాన కెమెరాని 48MP SonyIMX598 సెన్సార్ ని OIS  ఫీచర్ తో  f/1.8 అపర్చర్ తో అందించింది. అంటే, ఈ మైన్ కెమెరా ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించడంలో అద్భుతంగా వుంటుంది. దీనికి జతగా 13MP అల్ట్రా-వైడ్ & మ్యాక్రో కెమెరా మరియు 2MP మోనో సెన్సార్ లను జతచేసింది. ఇందులో, పిక్సెల్ షిఫ్ట్ అనే కొత్త ఫీచర్ ను కూడా జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది. 

Battery & Other ఫీచర్లు

IQOO 7 5G డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Hi-Res సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ 4,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 66W ఫ్లాష్  ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ ను  0% నుండి 100% నింపడానికి కేవలం 30 నిముషాల సమయం మాత్రమే తీసుకుంటుందని IQOO తెలిపింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo