Amazon Sale నుండి HONOR 90 పైన ధమాకా అఫర్..!

Amazon Sale నుండి HONOR 90 పైన ధమాకా అఫర్..!

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు HONOR 90 పైన ధమాకా అఫర్ అందించింది. హానర్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన హానర్ 90 స్మార్ట్ ఫోన్ పైన ఈరోజు Amazon Sale నుండి భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. భారీ స్పెక్స్ వచ్చిన ఈ హానర్ స్మార్ట్ ఫోన్ సేల్ ఆఫర్లతో చాలా తక్కువ ధరలో లభిస్తోంది. అందుకే , ఈరోజు అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.

Amazon Sale Offer

honor 90 offers on amazon gif 2023 sale
హానర్ 90 స్మార్ట్ ఫోన్ ఆఫర్స్

హానర్ 90 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 37,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, అమేజాన్ సేల్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 30,999 రూపాయలకే సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను SBI Credit Card Non EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 3,250 రూపాయల ఫ్లాట్ అధనపు డిస్కౌంట్ ను కూడా అమేజాన్ అఫర్ చేస్తోంది. అలాగే, ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా ఈ ఫోన్ పైన అందిస్తోంది అమేజాన్. Buy from Here

Also Read : Amazon GIF Sale: భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తున్న 5.1 Channel సౌండ్ బార్స్.!

HONOR 90 Specs & Features

ఇక హానర్ 90 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ & ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ హానర్ ఫోన్ ఇండియాలో మొదటి Eye Risk-Free డిస్ప్లే తో వచ్చిన ఫోన్ గా గుర్తింపు పొందింది. హానర్ 90 లో 6.7 ఇంచ్ 120Hz Quad-Curved Floating AMOLED డిస్ప్లే 1600పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 1 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Honor 90 offers and specs
హానర్ 90 స్మార్ట్ ఫోన్

ఈ ఫోన్ లో 200MP Ultra-Clear మెయిన్ కెమేరా + 12MP అల్ట్రా వైడ్/ మ్యాక్రో సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరాతో పాటుగా 50MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా తో అద్భుతమై ఫోటోలను చిత్రీకరించ వచ్చని హానర్ చెబుతోంది. ఈ హానర్ 90 స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo