Amazon GFF Sale 2024: ఐఫోన్ 13 పై అమెజాన్ అప్ కమింగ్ సేల్ జబర్దస్త్ ఆఫర్.!

HIGHLIGHTS

Amazon GFF Sale 2024 జబర్దస్త్ ఆఫర్లను ఒక రోజు ముందే వెల్లడించింది

ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రైమ్ మెంబర్స్ కోసం ఈ సేల్ ప్రారంభం అవుతుంది

ఈ సేల్ నుంచి ఐఫోన్ 13 పై జబర్దస్త్ ఆఫర్ అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది

Amazon GFF Sale 2024: ఐఫోన్ 13 పై అమెజాన్ అప్ కమింగ్ సేల్ జబర్దస్త్ ఆఫర్.!

Amazon GFF Sale 2024: అమెజాన్ అప్ కమింగ్ సేల్ ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ నుంచి అందించనున్న జబర్దస్త్ ఆఫర్లను ఒక రోజు ముందే వెల్లడించింది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రైమ్ మెంబర్స్ కోసం ఈ సేల్ ప్రారంభం అవుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ సేల్ నుంచి ఐఫోన్ 13 పై జబర్దస్త్ ఆఫర్ అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GFF Sale 2024: ఐఫోన్ 13 ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఐఫోన్ 13 ఫోన్ ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు పొందవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఐఫోన్ 13 ఫోన్ పై అమెజాన్ ఆఫర్ చేయబోతున్నట్లు చెబుతున్న ఆ ఆఫర్స్ మరియు డీల్స్ ఏమిటో చూద్దాం పదండి.

ఐఫోన్ 13 ఆఫర్

ఐఫోన్ 13 ఫోన్ ను అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి అన్ని ఆఫర్లతో కలిపి కేవలం రూ. 47,999 రూపాయల ధరకే అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ పైన డిస్కౌంట్ మరియు SBI కార్డ్స్ పై 10% డిస్కౌంట్ కలిపి ఈ ధరకు అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 (128GB) బేసిక్ వేరియంట్ ప్రస్తుతం రూ. 52,090 రూపాయల రేటుతో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది.

Amazon GFF Sale 2024 iPhone 13 deal

అమెజాన్ అందించిన ప్రీ సేల్ టీజింగ్ ఆఫర్ ప్రైస్ ట్యాగ్ ను బట్టి చూస్తుంటే, ఈ ఫోన్ పైన దాదాపు రూ. 4,091 రూపాయల తగ్గింపు అందుకునే అవకాశం వుంది.

Also Read: Samsung Galaxy F14: రూ. 8,999 ధరకే 50MP ట్రిపుల్ కెమెరాతో వచ్చింది.!

కేవలం ఐఫోన్ 13 మాత్రమే కాదు అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి Oneplus లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ పైన కూడా భారీ ఆఫర్లు పొందవచ్చని చెబుతోంది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్లతో తో ఈ ఫోన్ కేవలం రూ. 16,999 రూపాయలకే పొందవచ్చని చెబుతోంది.

Amazon GFF Sale 2024

ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 19,999 రూపాయల ధరకు అమెజాన్ నుంచి లిస్ట్ చేయబడింది. అంటే, ఈ ఫోన్ పైన రూ. 3,000 రూపాయల తగ్గింపు ను కస్టమర్లు అందుకునే అవకాశం వుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి మొదలవనున్న ఈ సేల్ నుంచి ఇంకా ఎటువంటి భారీ ఆఫర్లను అందిస్తుందో వేచి చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo