HIGHLIGHTS
అమేజాన్ ప్రైమ్ డే 2023 సేల్ ఈరోజు ముగుస్తుంది
ఈరోజు భారీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది
Samsung 5G ఫోన్ ను ఎన్నడూ చూడనంత చావక ధరకే పొందవచ్చు
అమేజాన్ ప్రైమ్ డే 2023 సేల్ ఈరోజు ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు భారీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది. శామ్సంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ S సిరీస్ నుండి వచ్చిన S20 FE ఈరోజు భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో ఎన్నడూ లేనంత చవక ధరకే లభిస్తోంది. అందుకే, Samsung Galaxy S20 FE 5G అఫర్ వివరాలు మరియు ఫోన్ ప్రత్యేకత పైన ఒక లుక్కేద్దామా.
Surveyఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ప్రైమ్ డే డీల్ ధర లో భాగంగా రూ. 26,999 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల కూపన్ అఫర్ ను కూడా అమేజాన్ జత చేసింది. తద్వారా, ఈ ఫోన్ ను రూ. 25,999 రూపాయలకే మీరు పొందవచ్చు. Buy From Here
అంతేకాదు, SBI బ్యాంక్ లేదా ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనితో పాటుగా అదనపు ఎక్స్ చేంజ్ ని కూడా అమేజాన్ అఫర్ చేస్తోంది. అంటే, అన్ని ఆఫర్లను అందిపుచ్చుకుంటే S20 FE 5G స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడనంత చావక ధరకే పొందవచ్చు.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 865 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు జతగా 12GB/128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 30X స్పెస్ జూమ్ సపోర్ట్ కలిగిన (12MP+8MP+12MP) ట్రిపుల్ కెమేరా ని ఈ ఫోన్ కలిగి వుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే ని FHD+ సపోర్ట్ తో కలిగి వుంది.
ఈ ఫోన్ లో వున్న మరిన్ని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 4500mAh పవర్ ఫుల్ బ్యాటరీని సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ ఫోన్ Pro Grade కెమేరా మరియు పవర్ ఫుల్ ప్రోసెసర్ తో తక్కువ ధరలో లభిస్తోంది.