Alcatel V3 Ultra 5G లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫీచర్స్ విడుదల చేసింది.!
Alcatel V3 Ultra 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫీచర్స్ రివీల్
చాలా కాలం తర్వాత ఇండియన్ మార్కెట్లో రీ ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ ఆల్కాటెల్
ఆల్కాటెల్ వి3 అల్ట్రా ను సెగ్మెంట్ ఫస్ట్ స్టయిల్స్ పెన్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది
Alcatel V3 Ultra 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ను ఈరోజు కంపెనీ రివీల్ చేసింది. చాలా కాలం తర్వాత ఇండియన్ మార్కెట్లో రీ ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ ఆల్కాటెల్, ఈసారి మార్కెట్ ను ఒడిసి పట్టుకోవడానికి తగిన ఫీచర్స్ తో అప్ కమింగ్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఆల్కాటెల్ అప్ కమింగ్ ఫోన్ ఆల్కాటెల్ వి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను స్టయిల్స్ పెన్ మరియు 108MP కెమెరా వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
SurveyAlcatel V3 Ultra 5G : లాంచ్ డేట్
ఆల్కాటెల్ వి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మే 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వుంది మరియు ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పీజీ అందించి టీజింగ్ చేస్తోంది.
Alcatel V3 Ultra 5G : ఫీచర్స్
ఆల్కాటెల్ వి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ ఫస్ట్ స్టయిల్స్ పెన్ కలిగిన ఫోన్ గా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ను eSIM + ఫిజికల్ SIM సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.8 ఇంచ్ FHD+ డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4 ఇన్ 1 డిస్ప్లే మోడ్ కలిగిన మొదటి ఫోన్ అవుతుందని ఆల్కాటెల్ తెలిపింది. ఈ ఫోన్ రీడింగ్ కోసం అచ్చంగా పేపర్ మాదిరిగా కనిపిస్తుంది మరియు కళ్లకు హాని కలిగించకుండా ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, 8MP వైడ్ యాంగిల్ మరియు 2MP కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ గురించి ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ ఎక్స్ ప్యాన్షన్ తో టోటల్ 16GB మరియు 128GB స్టోరేజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
Also Read: iQOO Neo 10 : ఐకూ అప్ కమింగ్ ఫోన్ Top 5 Features ముందే తెలుసుకోండి.!
ఈ ఫోన్ చాలా స్లీక్ డైజిన్ కలిగి ఉంటుంది. ఇందులో 5010 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఇది కాకుండా ఈ ఫోన్ లో DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జర్, స్టయిల్స్ పెన్, కేబుల్ మరియు బ్యాక్ కవర్ అందిస్తుంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో వస్తుంది.
ఈ ఫోన్ లాంచ్ చేయడానికి వారం రోజులు ముందే ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ కంపెనీ బయట పెట్టడం విశేషం.