iQOO Neo 10 : ఐకూ అప్ కమింగ్ ఫోన్ Top 5 Features ముందే తెలుసుకోండి.!
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ నియో 10 వచ్చే వారం లాంచ్ అవుతుంది
కంపెనీ ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ఇప్పటికే వెల్లడించింది
iQOO Neo 10 ఫోన్ యొక్క Top 5 Features కూడా అందించింది
iQOO Neo 10: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ నియో 10 వచ్చే వారం లాంచ్ అవుతుంది . అయితే, కంపెనీ ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ఇప్పటికే వెల్లడించింది. వీటిలో ఈ ఫోన్ యొక్క Top 5 Features కూడా అందించింది. ఐకూ ఈ ఫోన్ గురించి చెబుతున్న ఆ టాప్ 5 ఫీచర్స్ మరియు ఈ ఫోన్ మరిన్ని వివరాలు ఏమిటో ఒక్క లుక్కేద్దామా.
SurveyiQOO Neo 10 : Top 5 Features
ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ మే 26 వ తేదీన మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ గొప్ప డిజైన్, పవర్ ఫుల్ చిప్ సెట్, బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

డిజైన్
ఐకూ ఈ ఫోన్ కూడా నియో సిరీస్ లో రెగ్యులర్ గా అందించే స్లీక్ డిజైన్ తో అందిస్తోంది. అయితే, ఇది ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ టైటానియం క్రోమ్ మరియు ఇన్ఫెర్నో రెడ్ అనే రెండు రంగుల్లో వస్తుంది.
చిప్ సెట్
ఈ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో Snapdragon 8s Gen 4 మరియు Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ రెండు చిప్ లు ఉంటాయి. ఈ ఫోన్ 24,20,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందిస్తుందని మరియు ప్రత్యేకమైన చిప్ తో గొప్ప గేమింగ్ ఫ్రేమ్ అందిస్తుందని కూడా ఐకూ చెబుతోంది.
పెర్ఫార్మెన్స్
ఈ ఫోన్ లో వేగవంతమైన పెర్ఫార్మన్స్ కోసం బిగ్ LPDDR5X ర్యామ్ మరియు ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ UFS 4.1 ఉంటాయి. ఈ ఫోన్ కలిగిన పవర్ ఫుల్ చిప్స్ సెట్ జతగా ఈ ర్యామ్ మరియు స్టోరేజ్ లు ఫోన్ ను మరింత వేగంగా మారుస్తాయని ఐకూ తెలిపింది.
డిస్ప్లే
ఈ ఫోన్ లో 144Hz సూపర్ రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ తో గొప్ప గేమింగ్ అనుభూతికి సహాయం చేస్తుందని ఐకూ చెబుతోంది.
Also Read: Soundbar Deal: 12 వేల బడ్జెట్ ధరలో 660W సౌండ్ అందించే Dolby 5.2 బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఇదే.!
బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్
ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ లో 7000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను శరవేగంగా ఛార్జ్ చేసే 120Hz అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
పైన తెలిపిన టాప్ 5 ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో Sony OIS పోర్ట్రైట్ సెన్సార్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరాలు ఉంటాయని ఐకూ తెలిపింది.