Ai+ Nova Tab launched under 20k with stunning features
Ai+ Nova Tab: భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఏఐ ప్లస్ మార్కెట్లో కొత్తగా బడ్జెట్ ట్యాబ్ ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ ను బడ్జెట్ 5జి సపోర్ట్ తో లాంచ్ చేయడం విశేషం. స్మార్ట్ ఫోన్ రేట్లు భారీగా పెరుగుతున్న క్రమంలో మొబైల్ యూజర్లు ఎక్కువ పెద్ద స్క్రీన్ తో వచ్చే బడ్జెట్ ట్యాబ్ లపై దృష్టి సారిస్తున్నట్లు కొత్త లెక్కలు చెబుతున్నాయి. ఈ మార్కెట్ ట్రెండ్ ను ఒడిసి పట్టేలా ఈ కొత్త టాబ్లెట్ మార్కెట్ లో ప్రవేశపెట్టినట్లు అనిపిస్తోంది.
ఈ టాబ్లెట్ ను కేవలం రూ. 19,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ Wi-Fi + 5G సపోర్ట్ తో వస్తుంది. ఇక్కడ సూచించిన ధర 6 GB + 128 GB బేసిక్ వేరియంట్ ధర మరియు 8 GB + 128 GB హై ఎండ్ వేరియంట్ రూ. 21,999 లాంచ్ అయ్యింది. ఇది కాకుండా ఈ టాబ్లెట్ ను మరింత చవక ధరలో అందుకోవడానికి వీలుగా రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 18,999 రూపాయల చవక ధరలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఏఐ ప్లస్ ఈ టాబ్లెట్ ని 11.97 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ విజువల్స్ సపోర్ట్ తో అందించింది. ఈ ట్యాబ్ ను 2.2GHz స్పీడ్ కలిగిన Unisoc T760 5G చిప్ సెట్ తో అందించింది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ టాబ్లెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో nxtQ OS పై పని చేస్తుంది.
ఇందులో 13MP మెయిన్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది FHD వీడియో రికార్డింగ్ మరియు ఆకట్టుకునే ఇమేజ్ లను అందిస్తుంది. ఈ టాబ్లెట్ ను 8000 mAh భారీ బ్యాటరీతో అందించింది మరియు ఈ ట్యాబ్ ను వేగంగా ఛార్జ్ చేసే 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా ఇందులో అందించింది. ఈ టాబ్లెట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టాబ్లెట్ తో పాటే ప్రొటెక్టింగ్ కేస్ ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
Also Read: Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి .. ఇది అతి చవక 5జి ఫోన్ గా వచ్చింది.!
బడ్జెట్ ధరలో కొత్త 5జి ట్యాబ్ కోసం చూసే యూజర్లు ఈ లేటెస్ట్ ట్యాబ్ ను పరిశీలించవచ్చు. అలాగే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డీల్స్ ను కూడా ఈ టాబ్లెట్ పైన అందుకోవచ్చు.