60MP సెల్ఫీ కెమెరా ఫోన్ మోటో ఎడ్జ్ 30 ప్రో సేల్.. ఎప్పుడంటే..!
మోటో ఇండియాలో విడుదల చేసిన 60MP సెల్ఫీ కెమెరా ఫోన్
ప్రీమియం ధరలో వచ్చిన హై ఎండ్ స్మార్ట్ ఫోన్
5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది
రీసెంట్ గా మోటో ఇండియాలో విడుదల చేసిన 60MP సెల్ఫీ కెమెరా ఫోన్ Moto Edge 30 Pro మార్చ్ 4 నుండి అమ్మకాలను సాగించనుంది. ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ భారీ 60MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ ప్రీమియం ధరలో వచ్చిన హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు ధరకు తగ్గట్టుగానే భారీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అందించింది.
SurveyMoto Edge 30 Pro: ధర మరేమియు ఆఫర్లు
మోటో ఎడ్జ్ 30 ప్రో ఒక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది రూ.49,999 రూపాయాల ప్రీమియం ధరతో వచ్చింది. అయితే, ఈ ఫోన్ పైన కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్ ను కూడా మోటోరోలా అందించింది. SBI క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ మార్చ్ 4 వ తేదీ నుండి Flipkart మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ లో లభిస్తుంది.
Moto Edge 30 Pro : సెక్స్
Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హై ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP OIS ప్రధాన సెన్సార్ కి జతగా 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో అద్భుతమైన ఫోటో గ్రఫీని ఎంజాయ్ చేయవచ్చని మోటో తెలిపింది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది.