HIGHLIGHTS
10 వేల లోపలే 11GB ర్యామ్ ఫోన్ కోరుకుంటున్నారా
10 వేల బడ్జెట్ ధరలో 11GB ర్యామ్ స్మార్ట్ ఫోన్
ఈ ఫోన్ 90Hz డిస్ప్లే మరిన్ని ఫీచర్లను కూడా కలిగి వుంది
10 వేల లోపలే 11GB ర్యామ్ ఫోన్ కోరుకుంటున్నారా? అయితే, మీరు కేవలం 10 వేల బడ్జెట్ ధరలో టెక్నో ఇటీవల విడుదల చేసిన 11GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ ని చూడవచ్చు. అదే,Tecno Spark 9 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ తో కలిపి మొత్తం 11GB ర్యామ్ తో వస్తుందని టెక్నో తెలిపింది. ఈ వర్చువల్ ర్యామ్ ను OTA అప్డేట్ ద్వారా అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కలిగి వుంది.
SurveyTecno Spark 9 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో మొత్తంగా 11GB ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.9,499 రూపాయల ధరతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి Citi మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారు 1,000 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
టెక్నో స్పార్క్ 9 స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ HD డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 5GB టోటల్ 11GB ర్యామ్ వరకు కలిగి ఉంటుందని దీనికి జతగా 128GB స్టోరేజ్ కూడా జత చేయబడుతుంది. ఈ ఫోన్ ఇన్ఫినిటీ బ్లాక్ మరియు స్కై మిర్రర్ అనే రెండు అక్షర్షణీయమైన కలర్ అప్షన్లలో వస్తుంది.
ఇక ఈ ఫోన్ కెమెరాల పరంగా చూస్తే, టెక్నో స్పార్క్ 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 13MP ప్రధాన కెమెరాతో జతగా మరొక కెమెరా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. Tecno Spark 9 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12OS తో లాంచ్ చేయబడుతుంది మరియు 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.