Realme X2 Pro గురించి తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

Realme X2 Pro  గురించి తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

రియల్మీ సంస్థ, ఈరోజు ఇండియాలో కొత్తగా ఒక గొప్ప 64MP కెమెరా మరియు వేగవంతమైన ప్రాసెసర్ తో RealMe X2 pro స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. కేవలం ఇది మాత్రమే కాకుండా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. నవంబర్ 26 వ తేదీ నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

1. ఈ రియల్మీ X2 Pro ఒక 6.5 అంగుళాల FHD + డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు అత్యధికంగా 1000 nits బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు.

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు DCI-P3 కలర్ స్పేస్ కలిగిన సూపర్ AMOLED  డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఈ ఫోన్ HDR10+ అధికారిక సర్టిఫికెట్ కలిగి ఉంది.   

3. రియల్మీ X2 ప్రో  వెనుకభాగంలో  64MP + 13MP + 8MP + 2MP  క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులోని 64MP ప్రధాన కెమేరా Samsung GW1 సెన్సార్ మరియు f /1.8 అపర్చరుతో వస్తుంది. ఇక ఇందులోని 13MP టెలిఫోటో లెన్స్ f /2.5 అపర్చరుతో వస్తుంది మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ f /2.2 అపర్చరుతో వస్తుంది. ఇక చివరిగా మిగిన 2MP కెమేరా f /2.4 అపర్చరుతో  పోర్ట్రైట్ల కోసం డెప్త్ సెన్సారుగా ఉపయోగపడుతుంది.

4. ముందుభాగంలో ఒక గొప్ప 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, HDR తో వీడియోలను కూడా తీసుకోవచ్చు.   

5.  ఈ ఫోన్ ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది ఒక Super VOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నలాజితో 50వాట్స్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఈ టెక్నాలజీతో ఈ ఫోన్ను కేవలం 35 నిముషాల్లోనే 100% ఛార్జింగ్ చేసుకోవచ్చు మరియు రియల్ టైం లోనే ఛార్జింగ్ అప్డేట్ చూడవచ్చు. 

6. రియల్మీ X2 ప్రో ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 855+ ఆక్టా కోర్ ప్రాసెసరుతో వస్తుంది. ఇది గరిష్టంగా 2.96GHz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. అలాగే,   స్పీడుగా పనిచేయగల LPDDR4X  RAM తో వస్తుంది. ఇది 7nm సాంకేతికతతో వస్తుంది మరియు జతగా 8GB లేదా 12GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా, ఈ రెండు వేరియంట్లతో వరుసగా 128GB మరియు 256GB  స్టోరేజిని అఫర్ చేస్తోంది.

7. ముఖ్యంగా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటక్షన్ తో వస్తుంది. అంటే స్క్రీన్ త్వరగా పాడవ్వదు మరియు రక్షణ కూడా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో కోత్త తరం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా తీసుకువస్తుంది.  

8.  ఈ ఫోన్, 8.7MM మందంతో సన్నగా మరియు నెప్ట్యూన్  బ్లూ మరియు లూనార్  వైట్ వంటి రెండు రంగులలో లభిస్తుంది. సౌండ్ పరంగా చూస్తే, ఇది Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మరియు సర్టిఫైడ్ Hi-Res సౌండ్ తో వస్తుంది. అధనంగా, రియల్మీ నుండి సరౌండ్ డ్యూయల్ స్పీకర్లతో వచ్చిన బెస్ట్ ఫోనుగా ఉంటుంది.    

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే ఇది ప్రస్తుత తరానికి స్టైల్ మరియు సేఫ్టీ పరంగా గొప్పగా ఉంటుంది. 

10. రియల్మీ X2 ప్రో యొక్క రెండు వేరియంట్ ధరలు     

1. రియల్మీ X2 ప్రో –  8GB RAM + 128 GB స్టోరేజి ధర – 29,999

2. రియల్మీ X2 ప్రో –  12GB RAM + 256 GB స్టోరేజి ధర – 33,999  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo