Infinix INBOOK Y3 Max: బడ్జెట్ ధరలో 12th జెన్ ఇంటెల్ కోర్ తో కొత్త ల్యాప్ టాప్ లాంచ్.!

HIGHLIGHTS

బడ్జెట్ యూజర్ల కోసం 12th జెన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్ తో కొత్త ల్యాప్ టాప్ లాంచ్

Infinix INBOOK Y3 Max కొత్త ల్యాప్ టాప్ లాంచ్

ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకమైన SATA స్లాట్ తో కూడా వస్తుంది

Infinix INBOOK Y3 Max: బడ్జెట్ ధరలో 12th జెన్ ఇంటెల్ కోర్ తో కొత్త ల్యాప్ టాప్ లాంచ్.!

Infinix INBOOK Y3 Max: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఈరోజు భారత్ బడ్జెట్ యూజర్ల కోసం 12th జెన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్ తో కొత్త ల్యాప్ టాప్ లాంచ్ చేసింది. ఈ కొత్త ల్యాప్ టాప్ ని గొప్ప పెర్ఫార్మెన్స్ మరియు డిజైన్ ల సమ్మేళనం గా అందించింది. ఈ కొత్త ల్యాప్ టాప్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix INBOOK Y3 Max: ఫీచర్స్

ఇన్ఫినిక్స్ ఈ కొత్త ఇన్ బుక్ వై 3 మాక్స్ ల్యాప్ టాప్ ను 12th జెన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్ జతగా i3, i5 మరియు i7 ఆప్షన్ లతో ఆఫర్ చేస్తోంది. ఈ ల్యాప్ టాప్ 16GB LPDDR4X ర్యామ్ మరియు 1TB of PCIe 3.0 SSD స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకమైన SATA స్లాట్ తో కూడా వస్తుంది మరియు ఈ ఫీచర్ తో 1TB వరకు స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం అందిస్తుంది.

Infinix INBOOK Y3 Max

ఇక ఈ కొత్త ల్యాప్ టాప్ డిస్ప్లే మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ల్యాప్ టాప్ FHD+ రిజల్యూషన్ కలిగిన IPS ప్యానల్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో అత్యంత వేగంగా రెస్సాన్స్ అందించే టాక్ టైల్ బ్యాక్ లైట్ కీ బోర్డు ఉందని కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది. ఇన్ఫినిక్స్ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్ టాప్ 70 Wh బ్యాటరీ మరియు 65W ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

Also Read: OnePlus Buds Pro 3: ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తుంది.!

Infinix INBOOK Y3 Max: ధర

ఇన్ఫినిక్స్ ఈ ఇన్ బుక్ వై 3 మాక్స్ ల్యాప్ టాప్ ని రూ. 29,990 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ల్యాప్ టాప్ ఆగస్టు 21వ తేదీ నుంచి Flipkart ద్వారా సేల్ అవుతుంది. ఈ ల్యాప్ టాప్ పైన మంచి ఆఫర్లు కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo