OnePlus Buds Pro 3: వన్ ప్లస్ బ్రాండ్ నుంచి కొత్త TWS ఇయర్ బడ్స్ ను విడుదల చేస్తోంది. వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 నెక్స్ట్ జనరేషన్ బడ్స్ గా వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 ని ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇయర్ బడ్స్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు కూడా వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus Buds Pro 3: లాంచ్
వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 ఇయర్ బడ్స్ ను ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు జరగనున్న ప్రత్యేకమైన ఈవెంట్ నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఇయర్ బడ్స్ కోసం అమెజాన్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అందుకే ఈ ఫోన్ లాంచ్ వివరాలతో ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించి టీజింగ్ చేస్తోంది.
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ బడ్స్ ను DynAudio సహకారంతో తీసుకువస్తున్నట్లు తెలిపింది. అద్భుతమైన సుపీరియర్ సౌండ్ కోసం డైన్ ఆడియో మాస్టర్ ట్యూన్డ్ తో ఈ బడ్స్ ను వస్తాయని వన్ ప్లస్ చెబుతోంది. ఈ బడ్స్ కొత్త మరియు అందమైన లుక్ లో కనిపిస్తోంది. వన్ ప్లస్ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ బడ్స్ వివరాలు అందించింది.
వన్ ప్లస్ ముందుగా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ బడ్స్ ప్రీమియం లెథర్ బాక్స్ తో ఉన్నట్లు కనిపించింది. అయితే, ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ బడ్స్ యొక్క అంచనా ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 ఇయర్ బడ్స్ DynAudio సహకారంతో 11mm డైనమిక్ మరియు 6mm టీటర్ కలిగిన డ్యూయల్ స్పీకర్ లను కలిగి ఉంటుందిట. ఈ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, డ్యూయల్ కనెక్షన్ మరియు Dynaudio EQ వంటి మరిన్ని గొప్ప ఫీచర్స్ తో వస్తుంది అని అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile