Google Book announced with Gemini Intelligence
Google Book: టెక్ దిగ్గజం గా ఇప్పటికే టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్, మరో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అందించిన Chromebook లకు ప్రత్యామ్నాయంగా “గూగుల్ బుక్” పేరుతో కొత్త AI ఆధారిత ల్యాప్ టాప్ ను గూగుల్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త ల్యాప్ టాప్ లు పూర్తిగా Gemini Intelligence తో రూపొందించబడ్డాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను కేవలం ఒక ఫీచర్ గా కాకుండా మొత్తం కంప్యూటింగ్ అనుభవానికి సెంటర్ గా మార్చడం లక్ష్యంగా గూగుల్ ఈ కొత్త గూగుల్ బుక్ ను పరిచయం చేసింది.
గూగుల్ బుక్ అనేది కొత్త తరహా AI ఫస్ట్ ల్యాప్ టాప్ ప్లాట్ ఫామ్ గా చెప్పొచ్చు. ఇది గూగుల్ క్రోమ్ OS ఆండ్రాయిడ్ మరియు Gemini AI టెక్నాలజీ యొక్క పూర్తి మిశ్రమంగా రూపొందించబడింది. గూగుల్ ఈద్ కొత్త బుక్ చెబుతూ, “ఇది సాధారణ ల్యాప్‌టాప్ కాదు.. ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ సిస్టమ్” అని దీని గురించి కొనియాడింది.
అన్ని ఆపరేటింగ్ సిస్టం ఒకే ప్లాట్ ఫామ్ పైన నడవడమే ల్యాప్ టాప్ ప్రత్యేకత. అంటే, ఇందులో క్రోమ్ బ్రౌజర్, జెమినీ AI అసిస్టెంట్, ఆండ్రాయిడ్ ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు గూగుల్ ప్లే యాప్స్ కూడా నడుస్తాయి. పైన తెలిపిన అన్నీ ఒకే ఎకోసిస్టమ్‌లో పని చేస్తాయి.
కొత్త గూగుల్ బుక్ లో ప్రధాన ఆకర్షణ జెమినీ ఇంటెలిజెన్స్. ఇది యూజర్ చేసే పనులను ముందే అర్థం చేసుకుని ముందుగానే సూచనలు ఇస్తుంది. అంటే, ఈమెయిల్‌లో తేదీ కనిపిస్తే ఆటోమేటిక్‌గా మీటింగ్ క్రియేట్ చేయమని సూచిస్తుంది. అలాగే, రెండు ఫోటోలు సెలెక్ట్ చేస్తే వాటిని కలిపి ఎలా కనిపిస్తాయో చూపిస్తుంది. అంతేకాదు, మీరు అందుకున్న టెక్స్ట్ మీ భాషలో లేకుంటే వెంటనే తర్జుమా చేసి అందిస్తుంది. ఇలాంటి AI ఫీచర్లు ల్యాప్ టాప్ వినియోగాన్ని పూర్తిగా మార్చేస్తాయని గూగుల్ పేర్కొంది.
ఈ ల్యాప్ టాప్ లో మరో ప్రత్యేకమైన ఆకర్షణగా Magic Pointer గురించి చెప్పవచ్చు. ఇది గూగుల్ బుక్ లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ అవుతుంది. ఇది సాధారణ కర్సర్ మాదిరిగా కాకుండా యూజర్ స్క్రీన్ పై ఏదైనా అంశంపై కర్సర్ ఉంచితే Gemini AI దానికి సంబంధించిన సూచనలు ఇస్తుంది. అంటే, టెక్స్ట్ పై ఉంచితే సమరీ లేదా ట్రాన్స్లేషన్ సెహెస్తుంది చేస్తుంది లేదా ఈమెయిల్ లోని తేదీ పై కర్సర్ పెడితే క్యాలెండర్ ఈవెంట్ ను సూచిస్తుంది. ఇలాంటి చాలా పనులు జస్ట్ కర్సర్ ను ఉంచడం తో చేయోచ్చు.
Also Read: Sony Bravia Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
గూగుల్ బుక్ ల్యాప్ టాప్ లు Android ఫోన్లతో మరింత సమన్వయంగా పనిచేస్తాయని గూగుల్ తెలిపింది. ఫోన్ Apps ను ల్యాప్ టాప్ లోనే వాడుకోవడం, ఫోన్ ఫైల్స్ ఫైళ్లు వెంటనే షేర్ చేయడం వంటి పనులు చేయవచ్చు. అంతేకాదు, నోటిఫికేషన్ షింక్, కాల్స్ మరియు మెసేజెస్ కూడా ల్యాప్ టాప్ లోనే సాధ్యం చేస్తుంది.