ఈ తొమ్మిది Xiaomi స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, షియోమి తన లేటెస్ట్ అప్డేట్ అందించడానికి రెడీ భావిస్తున్నారు. షియోమి రాబోయే అప్ కమింగ్ వెర్షన్ MIUI 13. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల కావచ్చని లేటెస్ట్ లీక్స్ మరియయు రూమర్లు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఇది ఇలా ఉండగా కొత్తగా వచ్చిన ఒక నివేదిక షియోమి కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న ఫోన్ల పేర్లతో కూడిన లిస్ట్ అందించింది. కానీ, ఎప్పటి వరకూ ఈ అప్డేట్ వస్తుందనే ఒక నిర్ణీత తేదీని మాత్రం వెల్లడించలేదు.
Survey
✅ Thank you for completing the survey!
ట్విట్టర్ యూజర్ Xiaomiui | Xiaomi & MIUI News నివేదిక ప్రకారం మొదటి విడతలో ఒక 9 షియోమి స్మార్ట్ ఫోన్లు MIUI 13 అప్డేట్ అందుకుంటాయి. MIUI 13 యొక్క సోర్స్ కోడ్ లో ఈ 9 షియోమి స్మార్ట్ ఫోన్ల పేర్లు కనిపించాయి. ఆ 9 షియోమి స్మార్ట్ ఫోన్ల యొక్క లిస్ట్ క్రింద చూడవచ్చు.
వాస్తవానికి, ఇప్పటి వరకు MIUI 13 గురించి వచ్చిన సమాచారం అంతా కూడా లీక్స్ మరియు రూమర్ల ద్వారా వాళ్ళదైనది మాత్రమే. MIUI 13 అప్డేట్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, లీక్స్ మాత్రం ఈ సంవత్సరం చివరి నాటికి ఈ అప్డేట్ విడుదల చేయబడుతుందని సూచిస్తున్నాయి.