18 నిముషాల్లో 100% ఛార్జింగ్ టెక్ తో వస్తున్నషియోమీ 12 ప్రో
Xiaomi 12 Pro విడుదల చేయడానికి షియోమీ డేట్ ఫిక్స్ చేసింది
ఇండస్ట్రీ లీడింగ్ డిస్ప్లే టెక్నాలజీ LTPO 2.0
50MP+50MP+50MP భారీ రియర్ కెమెరా సెటప్
Xiaomi 12 Pro ను ఏప్రిల్ 27వ తేదీన ఇండియాలో విడుదల చేయడానికి షియోమీ డేట్ ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం చివరిలో చైనాలో భారీ ఫీచర్లతో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ ఇండియాలో విడ్డుదాల కాబోతోంది. ఈ 50MP+50MP+50MP భారీ రియర్ కెమెరా సెటప్ మరియు ఇండస్ట్రీలో లీడింగ్ డిస్ప్లే టెక్నాలజీ అయిన LTPO 2.0 వంటి మరిన్ని భారీ స్పెక్స్ తో ఇండియాలో విడుదల అవుతోంది. అయితే, ఇండియా వేరియంట్ మరియు చైనా వేరియంట్ స్పెక్స్ లో ఏవైనా మార్పులు ఉంటాయా లేక ఉండవా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
Surveyఅయితే, ఇండియన్ వేరియంట్ లో అందించినట్లుగా చెబుతున్న ఛార్జింగ్ టెక్ మాత్రం చాలా ఆకట్టుకుంటోంది. కేవలం 18 నిముషాల్లో ఈ ఫోన్ ను 100% ఛార్జింగ్ చెయ్యగల 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ షియోమీ 12 ప్రో లో అందించినట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఇక మరిన్ని అంచనా ఫీచర్లను గురించి చూడాలంటే చైనా వేరియంట్ లో అందించిన స్పెక్స్ ను పరిశీలించవచ్చు.
Xiaomi 12 Pro: స్పెక్స్ (చైనా వేరియంట్)
షియోమి 12 సిరీస్ లో ఇది ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు దీని ధర మాత్రమే కాదు ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల QHD+ (3200×1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.
ఈ ఫోన్ కూడా 12 మాదిరిగా, లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13పై నడుస్తుంది. ఈ ఫోన్ లో OISతో 50MP కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది.
Xiaomi 12 Pro: ధర (చైనా వేరియంట్)
12 సిరీస్ లో ఇది ప్రీమియం వేరియంట్ . ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 8GB+128GB లో RMB 4699 (సుమారు రూ. 55,000) ప్రారంభ ధరతో ఉంటుంది.