4K TV, 48 inches
తాజాగా Xiaomi మొబైల్స్ తో పాటు హోం appliances పై కూడా మార్కెటింగ్ చేస్తుంది. చైనా లో జరిగిన స్పెషన్ ఈవెంట్ లో Xiaomi Mi 4 స్మార్ట్ ఫోన్ కన్నా 1mm ఎక్కువ ఉన్న 9.9 mm అతి సన్నని టీవీ ను లాంచ్ చేసింది.
Survey48 inches ఉన్న ఈ టీవీ 4K రిసల్యుషణ్ తో వస్తుంది అని చెబుతుంది కంపెని. దీని పేరు Xiaomi Mi TV 2S. రెండు వెర్షన్స్ లో లాంచ్ అవుతుంది. స్టాండర్డ్ వెర్షన్ 30,679 రూ. థియేటర్ వెర్షన్ 40,909 రూ. జులై 22 నుండి చైనా లో బయట outlets లో అమ్మకాలు ప్రారంభించింది Xiaomi.
ప్రస్తుతానికి దీని ఇండియన్ సేల్స్ పై ఇంకా ఎటువంటి అనౌన్సమెంట్ చేయలేదు కంపెని. Xiaomi Mi 2S టీవీ లో 2gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, Mstar 6A928 చిప్ సెట్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0 పై MIUI TV OS ఆధారంగా పనిచేస్తుంది టీవీ. HDMI 2.0, USB 3.0, WiFi, బ్లూటూత్ 4.0 స్పెషల్ ఫీచర్స్. దీనిలో సుపిరియర్ సౌండ్ క్వాలిటి ఉండనుంది. ఫోన్ మాదిరిగానే టీవీ కు కూడా కంపెని గోల్డ్ పింక్ బ్లూ గ్రీన్ సిల్వర్ బ్యాక్ ప్యానల్ కలర్స్ ను లాంచ్ చేసింది.