Xiaomi ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్: MIUI 13 అప్డేట్ వచ్చేసింది..!

HIGHLIGHTS

Xiaomi యూజర్ల కోసం కొత్త మేజర్ అప్డేట్ గుడ్ న్యూస్ ప్రకటించింది

షియోమి ఇండియాలో MIUI 13 అప్డేట్ ను విడుదల చేసింది

MIUI 13 అప్డేట్ లో చాలా కొత్త విషయాలను జతచేసింది

Xiaomi ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్: MIUI 13 అప్డేట్ వచ్చేసింది..!

Xiaomi యూజర్ల కోసం కొత్త మేజర్ అప్డేట్ గుడ్ న్యూస్ ప్రకటించింది. షియోమి ఇండియాలో MIUI 13 అప్డేట్ ను విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ కోసం షియోమి యొక్క కస్టమ్ స్కిన్ కి  సరికొత్త అప్డేట్ మరియు ఇది Android 12 ఆధారపడి వుంది. ఈ మేజర్ అప్డేట్ ద్వారా అప్‌డేట్ చేయబడిన సిస్టమ్ Apps, కొత్త విడ్జెట్‌లు, Mi Sans ఫాంట్, క్రియేటివ్ లైవ్ వాల్‌పేపర్ ఎంపికలతో సహా మల్టీ టాస్కింగ్ ఆప్షన్స్  వంటి గుర్తించదగిన చేర్పులు ఇందులో చేర్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా, MIUI 13 ఫీచర్ల గురించి మాట్లాడితే, 5 ఫీచర్లను గురించి చూడవచ్చు. అందులో, మెరుగైన ప్రైవసీ, కొత్త డిజైన్ ఎలిమెంట్స్, App Updates, పెర్ఫార్మెన్స్ మెరుగుదల మరియు బ్యాటరీ సొల్యూషన్స్ గురించి చూడవచ్చు. అంటే, MIUI 13 ద్వారా మెరుగైన యూజర్ ఇంటర్ ఫెజ్ ను యూజర్లకు అందించడానికి షియోమి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు.

MIUI 13 650.jpg

మీ లోకల్ డేటాని మరింత సెక్యూర్ గా ఉంచడానికి మీ ఫేస్ ను స్కాన్ చేసే విదంగా Privacy Camera , Protect Clipboard మరియు Approximate Location వంటి ఫీచర్లతో మెరుగైన ప్రైవసీని తీసుకొచ్చింది. ఇక కొత్త డిజైన్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే, లైవ్ వాల్‌పేపర్‌లు, సున్నితమైన మరియు మరింత సహజమైన యాప్/సిస్టమ్ మరియు వన్-హ్యాండ్ మోడ్ వంటి చాలా కొత్త విషయాలను జతచేసింది.

భారతదేశంలో MIUI 13 గ్లోబల్ సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్స్ మరియు లభ్యత తేదీల విషయానికి వస్తే, ఈ క్రింద సూచించిన లిస్ట్ ను చూడండి.

మి 11 అల్ట్రా

మి 11X

మి 11X ప్రో

షియోమి 11T ప్రో

షియోమి 11 లైట్ NE 5G

మి 11 లైట్

రెడ్‌మీ నోట్ 10

రెడ్‌మీ నోట్ 10 ప్రో

రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్

రెడ్‌మీ 10 ప్రైమ్  

 

రాబోయే నెలల్లో మరిన్ని స్మార్ట్ ఫోన్లు ఈ జాబితాలో చేర్చనుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo