Whatsapp: 2022 లో ఆరు కొత్త అప్డేట్ లను జత చేయనున్న వాట్సాప్
Whatsapp 2022 కొత్త సంవత్సరంలో కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది
గత సంవత్సరం వాట్సాప్ కొత్త ఫీచర్లను చాలానే పరిచయం చేసింది
ఈ 6 ఫీచర్లను అతి త్వరలోనే వాట్సాప్ కి జతచేయవచ్చు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యమైన మెసెంజర్ యాప్ Whatsapp 2022 కొత్త సంవత్సరంలో కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. గత సంవత్సరం వాట్సాప్ కొత్త ఫీచర్లను చాలానే పరిచయం చేసింది. అదే దారిలో కొత్త సంవత్సరంలో కూడా డెస్క్‌టాప్ పైన వీడియో కాలింగ్, డిసప్పీయరింగ్ ఫోటోస్ మరియు వీడియోల ఫీచర్ వంటి మరిన్ని ఫీచర్లను తీసుకురాబోతోంది.
Surveyవాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్లలో 6 ఫీచర్ల గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఈ 6 ఫీచర్లను అతి త్వరలోనే వాట్సాప్ కి జతచేయవచ్చు. మరి ఆ 6 ఫీచర్లు ఏమిటో చూద్దామా.
1.లాస్ట్ సీన్ హైడ్
ఈ ఫీచర్ గురించి గత సంవత్సరం నుండే వింటువున్నాం. ఈ Last Seen Hide ఫీచర్ ద్వారా యూజర్లు వారు వాట్సాప్ చివరిగా ఎప్పుడు చూశారో తెలియకుండా దాచిపెట్టవచ్చు. ఇది కేవలం సెలెక్టెడ్ కంటాక్ట్స్ కోసం చేయడం సాధ్యం కాదు కానీ అన్ని కాంటాక్ట్ లకు మీరు చివరిగా ఎప్పుడు వాట్సాప్ చూశారో తెలియకుండా హైడ్ చేసే విధంగా మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌పై యాప్ పని చేస్తోంది.
2. ప్రొఫైల్ ఫోటో డిస్ప్లే ఆన్ నోటిఫికేషన్
WhatsApp నిజంగా అద్భుతమైన ఫీచర్‌ను జోడించబోతోంది. ప్రొఫైల్ ఫోటో డిస్ప్లే ఆన్ నోటిఫికేషన్ ఇప్పటికే కొంతమంది iOS యూజర్లకు అందుబాటులో వుంది. ఈ ఫీచర్ తో యూజర్లు కొత్త మెసేజ్ ను అందుకున్నప్పుడు నోటిఫికేషన్‌లో ప్రొఫైల్ ఫోటోను చూపుతుంది. iOS 15లో కొంతమంది బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ విడుదల చేయబడింది.
3. వాట్సాప్ మెసేజ్ రియాక్షన్
వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ కోసం కూడా పనిచేస్తోంది. అదే, మెసేజ్ రియాక్షన్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా వచ్చిన మెసేజ్ లకు ఎమోజీల పంపడం ద్వారా రియాక్ట్ కావచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీకు కావాల్సిన మెసేజ్ ని నొక్కిపట్టుకావాలి, తరువాత అక్కడ కనిపించే ఎమోజీల్లో తగిన ఎమోజీ ఎంచుకోవచ్చు. ఇది ఇప్పటికే Facebook మరియు Instagramలో అందుబాటులో వుంది.
4. వాట్సాప్ కమ్యూనిటీ
వాట్సాప్ గ్రూప్‌లను పెద్దదిగా చేయడానికి వాట్సాప్ ముందు ముందు ఒక కమ్యూనిటీలో 10 చాట్ గ్రూప్స్ ని జత చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఈ ఫీచర్ కేవలం అడ్మిన్ కు మాత్రమే లభిస్తుంది మరియు దీని ద్వారా కమ్యూనిటీలోని అన్ని గ్రూప్స్ లకు మెసేజీలు పంపించవచ్చు.
5. వాట్సాప్ లాగ్‌అవుట్
మల్టి డివైజ్ ఫీచర తో పాటుగా లాగ్‌అవుట్ ఫీచర్ ను కూడా ఈ సంవత్సరం వాట్సాప్ తీసుకురావచ్చు. యూజర్లు ఈ ఫీచర్ ద్వారా తమ Facebook, Instagram ల మాదిరిగానే WhatsApp ఖాతాల నుండి కూడా లాగ్ అవుట్ చేయవచ్చు.
6. వాట్సాప్ రిసిపెంట్స్ యాడింగ్
షేర్ చేసిన వాట్సాప్ రిసిపెంట్స్ ను ఇక మీరు సవరించగలరు. రిపోర్ట్ ప్రకారం, మీరు ఏ యూజర్‌తో మీడియాను షేర్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇంటర్‌ఫేస్‌ని రీడిజైన్ చేస్తుంది.ఈ కొత్త ఫీచర్, మీ చాటింగ్ లో ఇమేజిలు, వీడియోలు మరియు GIF లను షేర్ చేస్తున్నప్పుడు స్టేటస్ అప్‌డేట్‌లపై మీడియాను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది.