వాట్స్అప్ లో అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది

వాట్స్అప్ లో అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది
HIGHLIGHTS

వాట్స్అప్ ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ అందించింది.

స్టేబుల్ అప్డేట్ విడుదల చేసింది

ఈ కొత్త ఫీచర్ కొత్త వెర్షన్ (V2.21.3.19) అప్డేట్ తో వస్తుంది.

ఫేస్ బుక్ సొంత యాప్ వాట్స్అప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను అందించిన వాట్స్అప్ ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ అందించింది. ఈ కొత్త ఫీచర్ ను గత కొన్ని వారాలుగా బీటా టెస్టింగ్ కోసం ఉంచగా ఇప్పుడు స్టేబుల్ అప్డేట్ విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ తో మీరు షేర్ చేసే ముందుగా వీడియోలను మ్యూట్ చెయ్యవచ్చు.

వాట్స్అప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ కొత్త వెర్షన్ (V2.21.3.19) అప్డేట్ తో వస్తుంది. ఈ అప్డేట్ తరువాత మీరు నేరుగా చిత్రీకరించే లేదా ముందుగానే వున్న వీడియోలలో మ్యూట్ చెయ్యడానికి వీలుగా మ్యూట్ బటన్ వస్తుంది. ఈ మ్యూట్ బటన్ మీ వాట్స్అప్ వీడియోలో క్రింద ఎడమ వైపున వస్తుంది. మీరు పంపించే వీడియో ప్లే చేసేప్పుడు సౌండ్ బయటికి రాకూడదు అనుకునే ఈ ఫీచర్ తో మ్యూట్ చేసి పంపించవచ్చు.     

ఇక రీసెంట్ గా వాట్స్అప్ ప్రకటించిన కొత్త ప్రైవసి గురించి చూస్తే వాట్స్అప్ కొత్త పాలసీలను యాక్సెప్ట్ చేయని వారిని, పూర్తిస్థాయి సేవలతో వాట్స్అప్ అకౌంట్ కోసం మే 15 వరకూ యాక్సెప్ట్ చెయ్యమని కోరుతుంది. అప్పటికి కూడా కొత్త పాలసీలను యాక్సెప్ట్ చేయని వారికీ కొన్ని సేవలు నిలిచి పోతాయి. వీటిలో, కొత్త పాలసీలను యాక్సెప్ట్ చెయ్యని వారు, తమ వాట్స్అప్ నుండి మెసేజిలను పంపడం లేదా చదవడం వంటివి చేయలేరు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo