WhatsApp Down: ఈ నెలలో మెటా సర్వీస్ ల పైన అనేక సమస్యలను యూజర్లు ఎదుర్కొన్నారు. రీసెంట్ గా మెటా షోషల్ మీడియా యాప్స్ అయిన Facebook, Instagram మరియు వాట్సాప్ ల సర్వర్ లు పని చెయ్యక పోవడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి వాట్సాప్ సర్వర్లు మొరాయించడంతో యూజర్లు తలలు పట్టుకున్నారు. గత అర్ధరాత్రి సమయంలో వాట్సాప్ లో అనేక సమస్యలను చూసినట్లు యూజర్లు ట్విట్టర్ సాక్షిగా ట్వీట్స్ తో వెల్లువెత్తారు.
Survey
✅ Thank you for completing the survey!
WhatsApp Down:
WhatsApp Down
గత రాత్రి 12 గంటల సమయంలో మెటా ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సడన్ గా పనిచేయకుండా మొరాయించింది. చాటింగ్, మెసేజ్ పంపడం మరియు గ్రూప్ చాట్ లలో స్టేటస్ లను అప్లోడ్ చేయడం వంటి మరిన్ని సమస్య లను ఎదుర్కొన్నట్లు యూజర్లు తెలిపారు. వాట్సాప్ సర్వర్ ల డౌన్ అవ్వడం వలన ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.
బుధవారం రాత్రి 11:44 నిముషాల నుండి వాట్సాప్ డౌన్ అయినట్లు యూజర్లు తెలిపారు. వాస్తవానికి, ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో వాట్సాప్ సర్వీస్ లకు అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు. కేవలం వాట్సాప్ యాప్ లో మాత్రామే ఈ సమస్య తలెత్తలేదు. వాట్సాప్ వెబ్ లో కూడా కొన్ని సమస్య ను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అంతేకాదు, లాగిన్ అవ్వడానికి అనుమతి దొరక లేదని మరియు లాగిన్ చాలా సార్లు లాగ్ ఆఫ్ అయినట్లు కూడా చెబుతున్నారు.
ఈ నెల ప్రారంభం నుండి వాట్సాప్ యూజర్లకు ఈ సమస్య ఎదురవ్వడం ఇది రెండవ సారి అవుతుంది. అయితే, ఈ సమస్య చాలా త్వరగానే పరిష్కరించ బడింది మరియు ప్రస్తుతం వాట్సాప్ సాఫీగా కొనసాగుతోంది. అయితే, రాత్రి 12 గంట సమయంలో వాట్సాప్ డౌన్ అవ్వడం చాలా మంది యూజర్లను అసహనానికి గురి చేసినట్లు తెలిపారు.