Meta యాజమాన్యం, భారతదేశంలో మెటా తో పాటుగా వాట్సాప్ లో తప్పు చేసేవారి పైన చర్యలు తీసుకుంటోంది. గత మూడు నెలల (సెప్టెంబర్, అక్టోబర్, నంవంబర్) మాదిరిగానే డిసెంబర్ నెలలో కూడా 20 లక్షలకు పైగా అకౌంట్స్ బ్యాన్ చేసింది. వాట్సాప్ విడుదల చేసిన డిసెంబర్ రిపోర్ట్ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. భారతదేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియట్ గైడ్‌లైన్స్ మరియు డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్) రూల్స్, 2021 కి అనుగుణంగా ఈ రిపోర్ట్స్ జారీ చేయబడ్డాయి.
Survey
✅ Thank you for completing the survey!
వాట్సాప్ యాప్ భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు ఈ వినియోగదారులు ఈ చాటింగ్ యాప్ నుండి నిషేధించబడ్డారు. వాట్సాప్ కొత్తగా ప్రకటించిన ఈ రిపోర్ట్ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకూ బ్యాన్ అయిన అకౌంట్స్ కు సంభందించినది. ఈ నెలలో వాట్సాప్ కు మొత్తం 528 ఫిర్యాదులు అందాయి. అలాగే, డిసెంబర్ నెలలో భారతదేశంలో మొత్తం 20,79,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ ధృవీకరించింది మరియు WhatsApp +91 ఫోన్ నంబర్ ద్వారా ఖాతాలను భారతీయుల అకౌంట్స్ గా గుర్తిస్తుంది.
వాట్సాప్ యూజర్లకు మరింత సౌకర్యాన్ని మరియు సెక్యూరిటీని అందించడానికి వీలుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వాట్సాప్ కు జతచేయడమే కాకుండా అనుచిత అకౌంట్స్ ను బ్యాన్ చేస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ ఉన్నందున, వాట్సాప్ అనుచిత అకౌంట్స్ ను నిలిపివేయడం లేదా నిషేధించగలదని కంపెనీ ప్రతినిధి తెలిపారు.