Digital Ration Card అంటే ఏమిటి మరియు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకోండి.!
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచే సంక్షేమ కార్యక్రమం రేషన్ కార్డు పథకం
Digital Ration Card ఉంటే ఎప్పుడైనా ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
అర్హులైన కుటుంబాలకు ఈ రేషన్ కార్డు ను అందిస్తున్నారు
ఆదాయం తక్కువ ఉన్న వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచే సంక్షేమ కార్యక్రమం రేషన్ కార్డు పథకం. ఇది తక్కువ ఆదాయం కలిగిన వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనికి అర్హులైన కుటుంబాలకు ఈ రేషన్ కార్డు ను అందిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం అందించే రేషన్ కార్డు అర్హులు అందరికీ అందుతుంది. ఇది ఫిజికల్ కార్డు మరియు ఇది లేకుండా చాలా పనులకు ఆటంకం కలుగుతుంది. అయితే, Digital Ration Card ఉంటే మాత్రం ఎక్కడైనా ఎప్పుడైనా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు షేర్ చేసే అవకాశం ఉంటుంది.
SurveyDigital Ration Card అంటే ఏమిటి?
రేషన్ కార్డు అనేది ప్రభుత్వం జారీ చేసే అధికారిక గుర్తింపు పత్రం మరియు ఇది అర్హత గల మాత్రమే అందిస్తుంది. ఇదే కార్డ్ యొక్క డిజిటల్ వెర్షన్ ను మనం డిజిటల్ రేషన్ కార్డు గా ఉంటుంది. ఈ డిజిటల్ రేషన్ కూడా ఫిజికల్ కార్డు మాదిరిగా ఉంటుంది. రేషన్ కార్డు కలిగిన వారు అన్నపూర్ణ పథకాలు మరియు PDS ద్వారా గోధుమలు, బియ్యం, నూనె, చక్కెర మరియు ఇతర నిత్యావసర సరుకులు ఉచితంగా లేదా నామమాత్రపు రేటుకి అందిస్తుంది.

వలస కూలీలు ఈ పధకం ద్వారా నిత్యావసర సరుకులు పొందడానికి ఇబ్బంది పడుతున్న కారణంగా రీసెంట్ గా ‘వన్ నేషన్ వన్ రేషన్’ పేరుతో కొత్త కార్డులు అందించింది. ఈ కార్డ్స్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సౌలభ్యం అందించింది. ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ కొత్త కార్డ్స్ అందించాయి. ఈ రేషన్ కార్డు పొందిన వారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు నెంబర్ మరియు థంబ్ ఇంప్రెషన్ తో రేషన్ తీసుకునే అవకాశం అందించింది.
Digital Ration Card ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
డిజిటల్ రేషన్ కార్డు డౌన్ లోడ్ కోసం ఆన్లైన్లో ప్రభుత్వ సైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే రేషన్ కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవాలని చూస్తున్నారో, వారి రాష్ట్రానికి సంబంధించిన ఆహార & పౌరసరఫరాల శాఖ (Food & Civil Supplies Department) అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కలిగిన వారు epdsap.ap.gov.in సైట్ మరియు తెలంగాణ రేషన్ కార్డు కలిగిన వారు epds.telangana.gov.in సైట్ ద్వారా ఈ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ముందుగా సైట్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత సైట్ లో పబ్లిక్ రిపోర్ట్స్ లేదా రేషన్ కార్డ్ సర్వీసెస్ అనే ట్యాబ్ పై నొక్కండి. ఇక్కడ ప్రింట్ రేషన్ కార్డు లేదా డౌన్లోడ్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అన్ని వివరాలు సరిచూసుకొని డౌన్లోడ్ లేదా ప్రింట్ బటన్ నొక్కండి. అంతే, మీ డిజిటల్ రేషన్ కార్డ్ వెంటనే డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుతుంది.
Also Read: 15000 mAh హెవీ బ్యాటరీతో Realme Concept ఫోన్ ప్రకటించింది.!
గమనిక : మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తో లింక్ అవ్వకపోతే డిజిటల్ రేషన్ కార్డ్ యాక్సెస్ ఉండదు. అలాగే, పైన అందించిన ఇమేజ్ Ai తో క్రియేట్ చేసిన ఇమేజ్ అని గమనించాలి. ఇది ఒరిజినల్ కార్డు ను పోలి ఉండదు.