ఇండియాలో VLC Media Player పైన నిషేధం..!!

Updated on 06-Oct-2022
HIGHLIGHTS

VLC Media Player పైన ప్రభుత్వం నిషేధం విధించింది

అత్యంత ప్రజాధారణ పొందిన VLC Media Player

భారత ప్రభుత్వం ఎటువంటి కారణం పేర్కొనకుండా దిన్ని నిషేధిండం ఆశ్చర్యపడే విషయం

అత్యంత ప్రజాధారణ పొందిన VLC Media Player పైన ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, భారత ప్రభుత్వం ఎటువంటి కారణం పేర్కొనకుండా దిన్ని నిషేధిండం ఆశ్చర్యపడే విషయం. అయితే, ప్రభుత్వం VLC Media Player ను పూర్తిగా నిషేదించ లేదు. మరి ఇందులో ఇబ్బంది ఏముంది అనుకుంటున్నారా? VLC మీడియా  ప్లేయర్ ఎటువంటి ఆటంకం లేకుండా భారతీయ వినియోగదారులకు పనిచేస్తుంది. కానీ, VLC యొక్క ప్రధాన వెబ్‌సైట్ మాత్రం భారతదేశంలో నిషేధించబడింది.

భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు ఎవరైనా సరే VideoLAN వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, వారు "మీరు అభ్యర్థించిన URL భారత టెలికమ్యూనికేషన్స్ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం బ్లాక్ చేయబడింది." అనే మెసేజ్ ను అందుకుంటారు.

VLC యొక్క మాతృసంస్థ అయిన VideoLAN ఈ విషయం గురించి స్పందిస్తూ, ఈ నిషేదానికి ఎటువంటి సంజాయిషి లేదా తమ వాదనలను వినిపించే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని కంపెనీ చెప్పింది. అందుకే, దీనికి ప్రతి చర్యగా వారు భారత ప్రభుత్వానికి లీగల్ నోటీసు కూడా పంపినట్లు తెలియ చేశారు. ఈ నోటీసులో కంపెనీ తమను తాము రక్షించుకోవడానికి అవకాశం ఉండేలా సైట్ బ్లాక్‌ చేయడానికి అయిన కారణాన్ని అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.

VLC Media Player ఎందుకు నిషేధించబడింది?

ఇప్పటి వరకూ భారతదేశంలో VLC Media Player నిషేధానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయ్యలేదు. అయితే, కంపెనీ ఈ చర్యకు దారితీసిన కారణాలను చెప్పాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను విజ్ఞప్తి చేస్తోంది. వాస్తవానికి, గతంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్న ప్రతిసారీ కూడా అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చేది. అయితే, VLC Media Player బ్యాన్ విషయం లో మాత్రమే ఆలా జరగలేదు.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, VLC Media Player App ఇప్పటికీ Google Play Store మరియు Apple App Storeలో అందుబాటులో ఉంది.  భారతదేశంలో ప్రభుత్వం నిషేధించిన అన్ని యాప్స్ ను కూడా వెనువెంటనే ఈ రెండు స్టోర్‌ల నుండి తీసివేస్తుంది. కానీ ఈ యాప్ ఇంకా ఈ రెండు స్టోర్ లలో అందుబాటులో వుంది. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :