Vivo T3 5G: Sony OIS కెమేరాతో రేపు విడుదల కాబోతున్న వివో టర్బో ఫోన్.!

HIGHLIGHTS

Vivo T3 5G రేపు ఇండియాలో విడుదల కాబోతోంది

కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ ను ముందే వివో అందించింది

Vivo T3 5G ఫోన్ యొక్క టీజ్డ్ స్పెక్స్ ద్వారా ఆకట్టుకుంటోంది.

Vivo T3 5G: Sony OIS కెమేరాతో రేపు విడుదల కాబోతున్న వివో టర్బో ఫోన్.!

Vivo T3 5G: వివో కొత్త స్మార్ట్ ఫోన్ వివో టి3 5జి రేపు ఇండియాలో విడుదల కాబోతోంది. చాలా కాలంగా వివో టీజింగ్ చేస్తున్న ఈ ఫోన్ లాంఛ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఈ వివో ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ ను ముందే వివో అందించింది. ఈ ఫోన్ లాంఛ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ మరియు ఫీచర్స్ పైన లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T3 5G లాంఛ్ ఎప్పుడు?

వివో టి3 5జి స్మార్ట్ ఫోన్ 21 March 2024 అంటే, రేపు మధ్యాహ్నం 12 గంటలకి విడుదల అవుతుంది. ఈ ఫోన్ వివో అధికారిక వెబ్సైట్ మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Vivo T3 5G టీజ్డ్ స్పెక్స్ ఏమిటి?

vivo t3 5g Processor
vivo T3 5G Processor

వివో టి3 5జి స్మార్ట్ ఫోన్ యొక్క టీజ్డ్ స్పెక్స్ ద్వారా ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Dimensity 7200 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తోంది. ఈ ప్రోసెసర్ 734K AnTuTu స్కోర్ తో ఈ బడ్జెట్ లో మంచి పెర్ఫార్మెన్స్ అందించ గల ప్రోసెసర్ అవుతుందని వివో తెలిపింది.

Also Read: Gold Market: ఈరోజు గరిష్ట ధర తాకిన పసిడి.. లైవ్ రేటు తెలుసుకోండి.!

వివో టి3 Camera గురించి ఏమి చెబుతోంది?

వివో కంపెనీ ఎప్పుడూ కూడా తన ఎక్కువ ఫోకస్ ను ఫోన్ కెమేరా పైన పెడుతుంది. ఇప్పుడు కూటాగా తీసుకు వస్తున్నా ఈ ఫోన్ కూడా అదే కోవకు చెందుతుంది. వివో టి3 5జి ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP Sony IMX882 OIS మెయిన్ కెమేరా ఉన్నట్లు వివో తెలిపింది.

Vivo T3 5G with Sony OIS camera
Vivo T3 5G with Sony OIS camera

అంతేకాదు, ఈ కెమేరా ఎటువంటి వివరాలను మరియు ఫీచర్స్ ను కలిగి ఉంటుందో కూడా లాంఛ్ కంటే ముందే తెలిపింది. సూపర్ నైట్ పోర్ట్రైట్ ఫోటోలను మరియు మంచి స్టెబిలిటీతో 4K Video లను ఈ ఫోన్ తో షూట్ చేయవచ్చని చెబుతొంది.

ఈ ఫోన్ రేపు విడుదల అవుతుంది కాబట్టి, ఈ ఫోన్ కంప్లీట్ వివరాలను రేపు మీ ముందు ఉంచుతాము.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo