Power House: చవక ధరలో 50,000mAh పవర్ ఫుల్ పవర్ బ్యాంక్ లాంచ్ చేసిన UNIX
50,000mAh పవర్ హౌస్ ను మొబైల్ యాక్సెసరీస్ కంపెనీ UNIX ఈరోజు విడుదల చేసింది
ఈ 50,000mAh పవర్ హౌస్ ను చవక ధరలో అందించింది
ఈ పవర్ హౌస్ ను కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందించింది
Power House: అధిక బ్యాటరీ బ్యాకప్ కోసం తగిన 50,000mAh పవర్ హౌస్ ను ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ యాక్సెసరీస్ కంపెనీ UNIX ఈరోజు విడుదల చేసింది. ఈ 50,000mAh పవర్ హౌస్ ను చవక ధరలో అందించింది. ఈ పవర్ హౌస్ కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందించింది. భారత మార్కెట్లో సరికొత్తగా విడుదలైన ఈ పవర్ హౌస్ విశేషాలు తెలుసుకోండి.
SurveyUNIX Power House : ప్రైస్
యునిక్స్ ఈ 50,000mAh పవర్ హౌస్ ను కేవలం రూ. 3,499 ధరతో విడుదల చేసింది. ఈ పవర్ హౌస్ ఈరోజు నుంచి unixindia.in నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది.
UNIX Power House :
యునిక్స్ విడుదల చేసిన ఈ 50,000mAh పవర్ హౌస్ అన్ని రకాల కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఇందులో మొత్తం 7 పోర్ట్స్ మరియు 4 చార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో, USB Type-C, Lightning మరియు రెండు USB-A పోర్ట్ లు ఉన్నాయి. అంతేకాదు, ఈ యూజర్ రక్షణ దృష్టిలో ఉంచుకొని ఇందులో బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ మెకానిజం అందించినట్లు కూడా యునిక్స్ తెలిపింది. ఈ పవర్ హౌస్ దీనికి కనెక్ట్ చేసే డివైజ్ రక్షణ మరియు ఓవర్ హీటింగ్ కాకుండా ఉండే విధంగా తయారు చేయబడిందని కూడా యునిక్స్ తెలిపింది.

ఈ పవర్ ఫుల్ పవర్ హౌస్ అవుట్ డోర్ కోసం పర్ఫెక్ట్ పార్టనర్ గా ఉంటుంది. ఈ పవర్ హౌస్ 22.5W వరకు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను అందిస్తుంది. ఒకేసారి 5 డివైజ్ లను ఒకేసారి ఛార్జ్ చేయగలిగే సత్తాతో ఈ పవర్ హౌస్ ను అందించింది. ఈ పవర్ బ్యాంక్ లో అందించిన డిజిటల్ డిస్ప్లే ఇందులో ఉన్న బ్యాటరీ స్టేటస్ ను రియల్ టైమ్ లో తెలుసుకునే అవకాశం అందిస్తుంది. అంతేకాదు, ఈ పవర్ హౌస్ లో అందించిన XX LED బల్బ్ తో ఇది పెద్ద హ్యాండీ LED టార్చ్ మాదిరిగా కూడా పని చేస్తుంది.
Also Read: TRAI New Rules: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్.!
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
