UIDAI కొత్త Aadhaar App ని లాంచ్ చేసింది .. కొత్త ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

ఆధార్ వినియోగదారుల కోసం UIDAI కొత్త Aadhaar App ని లాంచ్ చేసింది

అవసరమైన కొత్త ఫీచర్స్ తో ఈ కొత్త యాప్ ను లాంచ్ చేసినట్లు యుఐడిఎఐ పేర్కొంది

ఆధార్ యూజర్ల వివరాలు గోప్యంగా ఉంచేలా ఈ కొత్త యాప్ ను అందించారు

ఆధార్ వినియోగదారుల కోసం UIDAI కొత్త Aadhaar App ని లాంచ్ చేసింది. అనుకూలమైన మరియు అవసరమైన కొత్త ఫీచర్స్ తో ఈ కొత్త యాప్ ను లాంచ్ చేసినట్లు యుఐడిఎఐ పేర్కొంది. భారతదేశంలో డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చే దిశగా ఈ కొత్త ఆధార్ యాప్‌ ను అందించినట్లు కూడా యుఐడిఎఐ తెలిపింది. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న mAadhaar యాప్‌ కు బదులుగా తీసుకువచ్చిన ఈ కొత్త యాప్‌ లో ప్రైవసీ, సెక్యూరిటీ మరియు వినియోగదారుల నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

UIDAI New Aadhaar App

ఆధార్ యూజర్ల వివరాలు గోప్యంగా ఉంచేలా ఈ కొత్త యాప్ ను అందించారు. అన్ని అవసరాలకు ప్రధానంగా ఉపయోగించే ప్రధాన పత్రం ఆధార్. అయితే, ఆధార్ లో వివరాలు అందరికీ షేర్ చేస్తే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే, ఆధార్ వివరాలు పూర్తిగా షేర్ చేయకుండా అవసరమైన సమాచారం మాత్రమే షేర్ చేసేలా ఈ కొత్త ను రూపొందించారు. ఈ కొత్త ఫీచర్ తో హోటల్ చెక్ ఇన్స్, బ్యాంకింగ్ KYC, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ మరియు ఇతర గుర్తింపు ధృవీకరణ ప్రక్రియ మరింత సురక్షితంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.

ఈ యాప్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త ఆధార్ యాప్‌ లో ఫేస్ అతేంటికేషన్ సపోర్ట్‌ ను యుఐడిఎఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. OTP ఆధారిత ధృవీకరణ తో పాటు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా యూజర్లు వారి గుర్తింపును నిర్ధారించుకోవచ్చు.

అలాగే, QR కోడ్ ఆధారిత వెరిఫికేషన్ ఫీచర్ ను కూడా అందులో అందించింది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డు ను ఎప్పుడూ వెంటే పెట్టుకునే అవసరం లేకుండా డిజిటల్‌ ఆధార్ ధృవీకరణ పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా, యూజర్లు వారి పూర్తి వివరాలతో కూడిన ఆధార్ ను కాకుండా పేరు మరియు వయస్సు తో అవసరమైన ఇతర పరిమిత సమాచారాన్ని మాత్రమే షేర్ చేసే సెక్యూర్ సదుపాయం ఈ యాప్‌ లో అందుబాటులో ఉంది.

Also Read: Realme Buds Air 8 Pro : ఫస్ట్ సేల్ కంటే ముందే ఫీచర్స్ అండ్ ప్రైస్ తెలుసుకోండి.!

భద్రత పరంగా కూడా ఈ యాప్‌ లో కీలకమైన అప్‌ గ్రేడ్‌ లు చేశారు. యూజర్ తన బయోమెట్రిక్ వివరాలను ఒకే క్లిక్‌తో లాక్ లేదా అన్‌ లాక్ చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఫింగర్‌ ప్రింట్, ఐరిస్ మరియు ఫేస్ ఆథెంటికేషన్ నియంత్రణలను నేరుగా యాప్‌ లో నిర్వహించవచ్చు. అదనంగా, ఆధార్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడింది అని చూపించే అథెంటికేషన్ హిస్టరీ ఫీచర్ కూడా ఈ యాప్ లో ఉంది.

ఈ కొత్త యాప్ ముందుగా వచ్చిన మరియు ఇప్పటికి ఉపయోగం లో ఉన్న mAadhaar యాప్ ను రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :