QR Code Aadhaar Card:ఊరు పేరు లేకుండా కొత్త ఆధార్ కార్డు వస్తోంది.!

HIGHLIGHTS

ప్రభుత్వం కొత్త కార్డు తీసుకువచ్చే పనిలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి

ఆధార్ కార్డులో పేరు, 12 అంకెల ఆధార్ నెంబర్ మరియు అడ్రస్ వంటి వివరాలు ఉండవట

వివరాలు గుప్తంగా ఉంచడానికి ఈ కొత్త కార్డు సహాయం చేస్తుందని చెబుతున్నారు

QR Code Aadhaar Card:ఊరు పేరు లేకుండా కొత్త ఆధార్ కార్డు వస్తోంది.!

QR Code Aadhaar Card: దేశంలో అన్ని అవసరాలకు ఉపయోంచబడే ప్రధాన ప్రూఫ్ గా ఉపయోగించే ఆధార్ కార్డు యొక్క సెక్యూరిటీ మరింత పెంచేలా ప్రభుత్వం కొత్త కార్డు తీసుకువచ్చే పనిలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు తీసుకువచ్చే కొత్త ఆధార్ కార్డులో పేరు, 12 అంకెల ఆధార్ నెంబర్ మరియు అడ్రస్ వంటి వివరాలు ఉండవట. కేవలం ఆధార్ కలిగిన వ్యక్తి ఫోటో మరియు క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయట. ఆధార్ హోల్డర్ యొక్క పేరు మరియు ఇతర వివరాలు గుప్తంగా ఉంచడానికి ఈ కొత్త కార్డు సహాయం చేస్తుందని చెబుతున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

QR Code Aadhaar Card:

ఇటీవల కాలంలో ఆధార్ కార్డు కి సంబంధించి చాలా అప్డేట్స్ మరియు కీలక మార్పులు మరియు మరింత సులభమైన యాక్సెస్ కోసం కొత్త యాప్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, వీటిని మంచి కొత్త అప్డేట్ తెచ్చే పనిలో UIDAI ఉన్నట్లు ఈ కొత్త నివేదికలు చెబుతున్నాయి. అదే క్యూఆర్ కోడ్ ఆధార్ కార్డు అప్డేట్. ఈ అప్డేట్ తో కొత్త కార్డ్ సిస్టం అందిస్తుందని చెబుతున్నారు. ఇందులో కార్డు హోల్డర్ పేరు, వయసు మరియు అడ్రస్ తో పాటు ఆధార్ నెంబర్ కూడా లేకుండా కేవలం ఫోటో మరియు క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త ఆధార్ కార్డు అందిస్తుంది.

ఈ విషయం పై UIDAI ప్రస్తుతానికి అధికారికంగా ఎటువంటి అప్డేట్ అందించే లేదు. అయితే, ఈ విషయంపై నెట్టింట్లో ఇప్పటికే వాడివేడిగా చర్చ మొదలయ్యింది. అయితే, ఈరోజు కూడా ప్రభుత్వం కొత్త ఆధార్ కార్డు అందించింది. ఇందులో మాస్క్ ఆధార్ కార్డు మరియు క్యూఆర్ కోడ్ తో కూడిన ఆధార్ సెట్ చేసుకోవడానికి వీలుంటుంది.

Also Read: బడ్జెట్ ప్రీమియం ఫోన్ Lava Agni 4 ఫస్ట్ సేల్ భారీ ఆఫర్ తో రేపు స్టార్ట్ అవుతుంది.!

ఆధార్ యాప్

ఈరోజు UIDAI కొత్త ఆధార్ యాప్ విడుదల చేసింది. సురక్షితమైన మరియు సులభమైన ఆధార్ ఇందులో అంతేకాదు, ఇందులో కుటుంబానికి చెందిన 5 మెంబర్ల ఆధార్ కార్డులు కూడా జత చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ యాప్ నుంచి నేరుగా ఆధార్ డౌన్లోడ్ కార్డు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఇందులో వచ్చే క్యూఆర్ ఆధార్ కార్డు ను డిజిటల్ గా చూపించవచ్చు. ఇందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ కార్డ్ వివరాలు చూడవచ్చు.

QR Code Aadhaar Card

ఈ కొత్త క్యూఆర్ కోడ్ ఆధార్ స్కాన్ చేస్తే ఎదుటి వారికి ఆధార్ నెంబర్ కాకుండా వివరాలు మాత్రమే కనిపిస్తాయి. ఇందులో ఆధార్ నెంబర్ యొక్క చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. అయితే, మనం మాట్లాడుతున్న క్యూర్ ఆధార్ కార్డు మరియు ఆధార్ యాప్ క్యూఆర్ కార్డు రెండు ఒకటో లేక మరింకేదైనా కొత్త అప్డేట్ అందిస్తుందో చూడాలి. కొత్త ఆధార్ అప్డేట్ మరియు సరికొత్త వివరాలతో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile