Happy Diwali 2026: మీ ఫోటోలను అద్భుతమైన AI దీపావళి ఇమేజెస్ గా మార్చే బెస్ట్ 3 ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్ ఇవిగో.!

Highlights

దీపావళి అంటే దీపాల వెలుగులు బాణాసంచా సందడితో కలిపి కుటుంబ సభ్యుల ఆనందం వెల్లివిరిసే పండుగ

ఈసారి మీ దీపావళి వేడుకలకు AI టెక్నాలజీతో మరింత ప్రత్యేకతను జోడించవచ్చు

Chat GPT Images మరియు Google Gemini వంటి AI ఇమేజ్ జనరేషన్ టూల్స్ తో అద్భుతమైన దీపావళి ఫోటోలు మీరే సొంతంగా సృష్టించుకోవచ్చు

Happy Diwali 2026: దీపావళి అంటే దీపాల వెలుగులు, రంగు రంగుల ముగ్గులు, బాణాసంచా సందడితో కలిపి కుటుంబ సభ్యుల ఆనందం వెల్లివిరిసే పండుగ. ప్రతి ఏడాది దీపావళి పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఇప్పటివరకు మీరు ప్రయత్నించని సరికొత్త రీతిలో ఈసారి మీ దీపావళి వేడుకలకు AI టెక్నాలజీతో మరింత ప్రత్యేకతను జోడించవచ్చు. ఎలాగంటే, ఉచితంగా అందుబాటులో ఉన్న Chat GPT Images మరియు Google Gemini వంటి AI ఇమేజ్ జనరేషన్ టూల్స్ సహాయంతో అద్భుతమైన దీపావళి ఫోటోలు మీరే సొంతంగా సృష్టించుకోవచ్చు. ఈ ఇమేజ్ లను మీకు ఇష్టమైన వారికి షేర్ చేయడం మరియు మీ స్టేటస్ లో పోస్ట్ చేయడం ద్వారా మీ ఆనందాన్ని మీ స్నేహితులు మరియు సన్నిహితులకు కూడా తెలియజేయవచ్చు.

Happy Diwali 2026: AI దీపావళి ఇమేజెస్

ఏఐ తో ఇమేజెస్ క్రియేట్ చేయాలని చెబుతున్నారు, కానీ మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మేము ఎలా క్రియేట్ చేయాలి అని మీరు అనుకోవచ్చు. ఎలాంటి ఫోటో ఎడిటింగ్ నైపుణ్యాలు లేకుండానే మనకు నచ్చిన విధంగా దీపావళి గ్రీటింగ్ కార్డులు, సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు, దీపాల అలంకరణ, కుటుంబ వేడుకలతో కూడిన ఇమేజెస్ ను చిటికెలో రూపొందించుకోవచ్చు. అయితే, ఇందుకోసం సరైన ప్రాంప్ట్ ఇవ్వడం ముఖ్యం. అందుకే, దీపావళి 2026 సందర్భంగా మీకోసం మూడు బెస్ట్ AI ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్ లను ఈరోజు అందించాము.

Happy Diwali 2026: AI ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి

  • ముందుగా ChatGPT లేదా Google Gemini వంటి AI ఇమేజ్ జనరేషన్ టూల్‌ ను ఓపెన్ చేయండి.
  • ఇందులో ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • క్రింద అందించి ప్రాంప్ట్‌ లలో మీకు నచ్చిన ఒకదాన్ని కాపీ చేసి అందులో అందించండి.
  • మీ సొంత ఫోటోతో చిత్రం కావాలంటే ఫోటోను అప్‌ లోడ్ చేసి, ముఖంలో ఎలాంటి మార్పులు చేయవద్దని ప్రాంప్ట్‌ లో రాయండి.
  • Generate బటన్‌ పై క్లిక్ చేసి చిత్రం సిద్ధమయ్యే వరకు వేచి ఉండండి.
  • ఇక్కడ అందించిన ఏఐ ఇమేజ్ లో ఏదైనా మార్పులు ఉంటే చేయండి
  • చివరిగా మీకు నచ్చిన చిత్రాన్ని సేవ్ చేసుకుని వాట్సాప్, ఇన్‌ స్టాగ్రామ్ మరియు ఫేస్‌ బుక్‌ లో షేర్ చేసుకోవచ్చు.

దీపావళి 2026 కోసం ఐదు బెస్ట్ AI ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్స్

సంప్రదాయ దీపావళి లుక్ కోసం బెస్ట్ ప్రాంప్ట్

“ఒక అందమైన భారతీయ యువతి సాంప్రదాయ పట్టు చీర ధరించి చేతిలో వెలుగుతున్న మట్టి ప్రమిద ని పట్టుకుని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నట్లు హై క్వాలిటీ ఫోటో రూపొందించు. వెనుక భాగంలో వందలాది దీపాలు, అందమైన రంగు రంగుల ముగ్గులు మరియు పూల అలంకరణలు ఉండాలి. ముఖంలో సహజమైన చిరునవ్వు, సంప్రదాయ ఆభరణాలు మరియు యువతి సహజమైన చర్మ రంగులో ఉండాలి. సినిమాటిక్ లైటింగ్, రియలిస్టిక్ ఫోటోగ్రఫీ, 4K క్వాలిటీ లో 9:16 ఫార్మాట్‌ లో రూపొందించు.”

అద్భుతమైన దీపావళి గ్రీటింగ్ కార్డ్ ప్రాంప్ట్

“2026 దీపావళి పండుగ సందర్భంగా ఒక అద్భుతమైన భారతీయ పండుగ గ్రీటింగ్ కార్డును రూపొందించు. ఇందులో మధ్యలో అందంగా వెలుగుతున్న పెద్ద మట్టి ప్రమిదలు, చుట్టూ పూలతో అలంకరించిన రంగు రంగుల ముగ్గులు, బంగారు కాంతులు, దీపాల వరుసలు ఉండాలి. అంతేకాదు, బ్యాక్‌ గ్రౌండ్‌ లో సంప్రదాయ భారతీయ కళా శైలి కనిపించాలి. చిత్రంలో స్పష్టంగా, తప్పులు లేకుండా "Happy Diwali 2026" అనే ఇంగ్లీష్ టెక్స్ట్ ఉండాలి. ప్రీమియం డిజైన్, అల్ట్రా HD క్వాలిటీ, 1:1 స్క్వేర్ ఫార్మాట్‌ లో రూపొందించు.”

సోషల్ మీడియా కోసం దీపావళి సెల్ఫీ ప్రాంప్ట్

నేను అప్‌ లోడ్ చేసిన ఫోటోలోని వ్యక్తి ముఖాన్ని, అసలు గుర్తింపును మరియు ముఖ కవళికలను ఏమాత్రం మార్చకుండా అందమైన దీపావళి ఫెస్టివల్ ఫోటోగా మార్చాలి. ఇందులో ఉన్న వ్యక్తి లేదా వ్యక్తులు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో ఉండాలి. అలాగే, చేతిలో వెలుగుతున్న ప్రమిద ఉండాలి. వెనుక భాగంలో అందమైన దీపాల అలంకరణ, పూల తోరణాలు, రంగు రంగుల ముగ్గులు మరియు బంగారు కాంతులు కనిపించాలి. వ్యక్తి ముఖం చాలా సహజంగా మరియు స్పష్టంగా ఉండాలి. ఈ ఇమేజ్ ను ప్రొఫెషనల్ DSLR ఫోటోగ్రఫీ, 4K రిజల్యూషన్, 9:16 పోర్ట్రెయిట్ ఫార్మాట్‌ లో రూపొందించు. అసలు ముఖాన్ని మార్చవద్దు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile