మీ LPG సబ్సిడీ డబ్బు జమ వివరాలు తెలుసుకోవడానికి సులభమైన పద్దతి

మీ LPG సబ్సిడీ డబ్బు జమ వివరాలు తెలుసుకోవడానికి సులభమైన పద్దతి

గ్యాస్ ఇప్పుడు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం, దీని కోసం ప్రతినెలా చేలా మొత్తంలో ఖర్చుచేస్తుంటాము. అయితే, ఈ గ్యాస్ పైన  మనం చేసే ఖర్చుపైన కూడా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కొంత మొత్తాన్ని మన బ్యాంకు ఖాతాలకు పంపుతుంది. కానీ,  ఇప్పటివరకూ ఎంతమొత్తాన్ని, మీ ఖాతాలో సబ్సిడీ రూపంలో ఎంత  పొందున్నారో మీకుతెలుసా?. ఒక వేళా తెలియకపొతే,  ఇక్కడ మీ సబ్సిడీ గురించి తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి చూడండి.                                

ముందుగా www.mylpg.in వెబ్ పేజీని సందర్శించండి . ఈ వెబ్ సైట్ నుండి ఆన్లైన్ LPG సబ్సిడీ ఎంపిక పై క్లిక్ చేయండి .మీ గ్యాస్ కనెక్షన్ను ఎంచుకోండి .తర్వాత మీరు తదుపరి పేజీకి వెళ్ళేటప్పుడు "ఫీడ్ బ్యాక్ ఇవ్వండి" కోసం మరొక ఎంపిక ఉంటుంది.

"ఫీడ్ బ్యాక్ ఇవ్వండి" ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత, పైన పేర్కొన్న విధంగా ఒక పేజీ తెరుచుకుంటుంది (ఇక్కడ కనిపిస్తున్న విధంగా). ఇక్కడ  వినియోగదారుల వివరాలను నమోదుచేసి, సబ్మిట్ చేయండి .అప్పుడు మీరు మొత్తం సమాచారాన్ని పొందుతారు . మీరు సమాచారం కోసం నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీని కూడా సంప్రదించవచ్చు.

చివరికి, మీరు గ్యాస్ టోల్ ఫ్రీ కస్టమర్ కేరులో మీ సమాచారాన్ని అందించినట్లయితే,  వినియోగదారుని సబ్సిడీ సమాచారాన్ని పొందుతారు. ఈ  టోల్ ఫ్రీ నంబర్ 18002333555,  కాబట్టి , మొత్తం ఈ మూడు విధానాల ద్వారా వినియోగదారుల యొక్క సబ్సిడీ సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo