Telegram CEO Pavel Durov reacts on telegram temporary restriction in india
NEET UG 2026 రీ ఎగ్జామ్ కు ముందు భారత ప్రభుత్వం టెలిగ్రామ్ సేవల పై తాత్కాలిక ఆంక్షలు విధించిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల లీకులు, తప్పుడు సమాచారం వ్యాప్తి మరియు మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ చర్యపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు మరియు CEO పావెల్ డురోవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మరియు ఈ విషయం పై ఘాటుగా స్పందించారు.
టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వల్ల భారతదేశంలోని కోట్లాది సాధారణ వినియోగదారుల కలిగినట్లు మరియు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, డురోవ్ తన అభిప్రాయం తెలిపారు. 150 మిలియన్ యూజర్లు కలిగిన టెలిగ్రామ్ లో విద్యార్థులు, వ్యాపార సంస్థలు, ఉద్యోగులు మరియు వివిధ కమ్యూనిటీలు రోజువారీ కమ్యూనికేషన్ కోసం టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారని, ఈ నిషేధంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అక్రమ కార్యకలాపాలకు పాల్పడే కొద్దిమంది యూజర్ల కారణంగా మొత్తం ప్లాట్ ఫారమ్ ను నిషేధించడం సరైన పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం పై మరింత ఘాటుగా స్పందిస్తూ, పరీక్షా పత్రాల లీక్ లను అరికట్టడంలో ఈ ఆంక్షలు ప్రభావవంతంగా ఉండవని డురోవ్ పేర్కొన్నారు. ఒక ప్లాట్ ఫారమ్ ను నిలిపివేస్తే అక్రమ కార్యకలాపాలు ఇతర యాప్ లకు మారే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక సోర్స్ ని నిలిపివేయడం సరైన మార్గం కాదని కూడా తెలిపారు.
చివరిగా, అసలు సమస్యను పరిష్కరించాలంటే లీక్‌ల మూలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ పై ఆంక్షలు విధించడం కంటే పరీక్షా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం అవసరమని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ పేర్కొన్నారు.
మరోవైపు, పరీక్షల సమగ్రతను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఈ తాత్కాలిక పరిమితులు అమలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read: X Down: మీ ఫోన్ లో ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పని చేయడం లేదా రీజన్ ఇదే.!
అయితే, ఈ కొత్త చర్యతో టెలిగ్రామ్ పై ఆంక్షలు మరియు డురోవ్ స్పందన ఇప్పుడు సాంకేతిక రంగంలో మాత్రమే కాదు డిజిటల్ స్వేచ్ఛ, సైబర్ భద్రత మరియు పరీక్షల పారదర్శకత పై కూడా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.
ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు జరిగినప్పుడు పెరిగిన టెక్నాలజీ మరియు సూపర్ ఫెసిలిటీ తో వచ్చే లాభ నష్టాల గురించి ఆలోచించాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం టెలిగ్రామ్ పై విధించిన తాత్కాలిక నిషేధం ఎప్పుడు ఎత్తి వేస్తుంది అని వేచి చూడాలి.