Redmi Note 17 5G top features and expected price know ahead of launch
Redmi Note 17 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ టాప్ ఫీచర్లతో పాటు ఎక్స్పెక్ట్ ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి. ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ గా నడుస్తున్న 8000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇదే కాదు ఈ ఫోన్ మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
డిజైన్ పరంగా, రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ కొంచెం మందంగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది ఏకంగా మూడు రోజుల వినియోగానికి తగిన బ్యాకప్ అందిస్తుందని షియోమీ చెబుతోంది. ఈ ఫోన్ అంతేకాదు, ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ నిజమైన రంగులు అందించే AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 100% DCI-P3 వైడ్ కలర్ గాముట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో కూడా వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ ను బలమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ రక్షణతో కూడా వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా స్లీక్ బెజెల్ మరియు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎం8 పవర్ కలిగిన అదే క్వాల్కమ్ Snapdragon Gen 4 చిప్ సెట్ కలిగి ఉంది. ఇది దాదాపు 6,00,000 AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్ మరియు డైలీ యూసేజ్ కోసం సరిపోతుంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ వివరాలు కూడా రెడ్ మీ ముందే వెల్లడించింది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా బంప్ ఈ ఫోన్ ను మరింత ప్రీమియం ఫోన్ గా కనిపించేలా చేసింది.
Also Read : POCO M8 Power vs Samsung Galaxy F70 Pro: ఈ లేటెస్ట్ 5జి ఫోన్లలో ఏ ఫోన్ కొనాలంటే.!
రెడ్ మీ ఈ ఫోన్ ప్రైస్ గురించి ఎటువంటి అధికారిక వివరాలు అందించలేదు. అయితే, ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ ప్రైస్ ఇంటర్నెట్ లో లీకైనట్లు చెబుతున్నారు. ఈ లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ రూ. 19,999 ప్రారంభ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ రేపు లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్ నిజం అవుతోందో కాదో రేపు తెలుస్తుంది.
ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి టీజింగ్ చేయబడుతోంది కాబట్టి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.