amazon great freedom sale 2026 Sony LG TCL top Smart Tv deals announced
Sony, LG మరియు TCL టాప్ Smart Tv లపై జబర్దస్త్ ఆఫర్స్ అందించింది అమెజాన్ ఇండియా. ఈ వారం చివరిలో ప్రారంభం కానున్న Amazon Great Freedom 2026 సేల్ బిగ్ డీల్స్ ని ఈరోజు రివీల్ చేసింది. ఈ డీల్స్ తో టాప్ బ్రాండ్స్ రిలీజ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీలు సైతం భారీ డిస్కౌంట్ తో చాలా రీజనబుల్ ధరలో లభించే అవకాశం ఉంది. మరి అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ గా రివీల్ చేసిన టాప్ స్మార్ట్ డీల్స్ చూద్దామా.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ 2026 సేల్ ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ కోసం అమెజాన్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఒక్కొక్క డీల్ ను రివిల్ చేయడం ప్రారంభించింది. ఈరోజు కొత్తగా సోనీ, ఎల్జీ మరియు టిసిఎల్ లేటెస్ట్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ డీల్స్ ని రివీల్ చేసింది. అమెజాన్ సేల్ నుంచి ఈ టీవీలను మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని టీజింగ్ చేసింది. ఈ మూడు స్మార్ట్ టీవీ డీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
సోనీ బ్రావియా 3 సిరీస్ నుంచి సోనీ అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుందని తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 77,990 రూపాయల ధరలో సేల్ అవుతోంది. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి అందించే అన్ని ఆఫర్స్ ఈ టీవీ 72 వేల రూపాయల ఆఫర్ ధరలో లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ మరియు విజువల్స్ అందిస్తుంది.
ఇది ఎల్ జి లేటెస్ట్ గ విడుదల చేసిన 55 ఇంచ్ నానో స్మార్ట్ టీవీ మరియు గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ ప్రస్తుతం రూ. 45,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. అయితే, ఈ టీవీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి కేవలం 42 వేల రూపాయల ఆఫర్ ధరలో లభించే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో సూపర్ విజువల్స్ అందించే నానో స్మార్ట్ టీవీ కోరుకునే వారికి ఇది బెస్ట్ అవుతుంది. ఇది 9.1.2 అప్ మిక్స్ మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read : Redmi Note 17 5G టాప్ ఫీచర్లతో పాటు ఎక్స్పెక్ట్ ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!
ఇది టిసిఎల్ రిలీజ్ చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మరియు 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ చాలా స్మూత్ విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 52,990 ధరలో సేల్ అవుతోంది. అయితే, ఈ టీవీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ కలుపుకొని అండర్ 50 వేల రూపాయల ధరలో లభించే అవకాశం ఉంది. ఇది గొప్ప స్క్రీన్ తో పాటు డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
మరిన్ని సేల్ ఆఫర్స్ మరియు డీల్స్ కోసం డిజిట్ ని ఫాలో అవ్వండి.