Tecno Spark 9T: ఫుల్ HD+ డిస్ప్లే మరియు 50MP కెమెరాతో వచ్చింది.!

Updated on 29-Jul-2022
HIGHLIGHTS

టెక్నో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ Tecno Spark 9T ను విడుదల చేసింది

బడ్జెట్ ధరలో మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్

ఆగష్టు 6 నుండి అమెజాన్ ద్వారా సేల్ కి వస్తుంది

ఇండియాలో వెనువెంటనే స్మార్ట్ ఫోన్స్ విడుదల చేస్తున్న మొబైల్ తయారీ కంపెనీలలో Tecno కూడా ఒకటి. టెక్నో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ Tecno Spark 9T ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్, FHD+ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టెక్నో సరికొత్తగా లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్, ఫీచర్లు మరియు మరిన్ని వివరాలను తెలుసుకోండి.

Tecno Spark 9T: ధర

Tecno Spark 9T స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64 ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.9,299 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది. ఆగష్టు 6 నుండి అమెజాన్ ద్వారా సేల్ కి వస్తుంది.   

Tecno Spark 9T: స్పెక్స్

టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ FHD+ డిరిజల్యూషన్ కలిగిన LCD ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 500 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G35 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ కి జతగా 64GB స్టోరేజ్ కూడా జత చేయబడుతుంది.  అంతేకాదు, ఈ ఫోన్ DTS స్టీరియో సౌండ్ మరియు IPX2 స్ప్లాష్ రెసిస్టెన్స్‌ని కూడా కలిగి ఉంది.

కెమెరాల విభాగంలో, టెక్నో స్పార్క్ 9టి లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు AI లెన్స్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11OS తో HiOS 7.6 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. టెక్నో స్పార్క్ 9టి రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.              

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :