Tim Cook resigned for his Apple CEO and john tornus appointed as news ceo
ఆపిల్ కంపెనీ గురించి ఏదైనా న్యూస్ బయటకు వచ్చిందంటే అది ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించే వార్తగా ఉంటుంది. ఐఫోన్, మ్యాక్ బుక్ మరియు ఐపాడ లతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఆపిల్ కంపెనీ పర్ఫెక్ట్ అనే పదానికి సరైన ఉదాహరణ గా నిలుస్తుంది. అటువంటి కంపెనీ ని నడిపించే సీఈఓ అందరికంటే ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే, గత 15 సంవత్సరాలుగా Apple CEO గా కొనసాగుతున్న Tim Cook తన పదవికి రాజీనామా చేశారు.
ఇది ఈరోజు ఉదయం నుంచి టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం రేపిన అతి పెద్ద వార్త. గత 15 సంవత్సరాలుగా ఆపిల్ సీఈఓ గా కొనసాగుతున్న టిమ్ కుక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది యావత్ టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
ఎందుకంటే, ఎక్కువ కాలం ఆపిల్ సీఈఓ గా కొనసాగిన స్టీవ్ జాబ్స్ తర్వాత 2011 లో టిమ్ కుక్ ఆపిల్ సీఈఓ గా నియమితులయ్యారు. అయితే, 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయన ఈ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఆపిల్ కంపెనీ అందించి కొత్త అనౌన్స్మెంట్ ప్రకారం, ఈ మార్పు ముందుగానే ప్లాన్ చేసిన లీడర్‌షిప్ ట్రాన్సిషన్ లో భాగం అని తెలుస్తోంది. అంటే, ఇది ముందుగానే కంపెనీ చేసిన అధికారిక ప్లాన్ లో భాగం అని కంపెనీ తెలిపింది.
ఇక నుంచి టిమ్ కుక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు. టిమ్ కుక్ నాయకత్వంలో ఆపిల్ అద్భుతంగా ఎదిగిందని తడుముకోకుండా చెప్పవచ్చు. టిమ్ కుక్ కాలంలో కంపెనీ విలువ $350 బిలియన్ నుంచి $4 ట్రిలియన్ కి పెరిగింది. ఇది మాత్రమే కేవలం కేవలం ఐఫోన్ మరియు మాక్ బుక్ కి మాత్రమే పరిమితమైన ఆపిల్ కంపెనీకి ఆపిల్ వాచ్ మరియు ఎయిర్ పాడ్స్ వంటి కొత్త ప్రొడక్ట్స్ ను కూడా పరిచయం చేశారు.
Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ ప్రైస్ కంటే ప్రకటించిన అమెజాన్.!
కొత్త సీఈఓ గా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టారు. జాన్ టెర్నస్ అమెరికాకు చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ మరియు ఈయన 2001 నుంచి ఆపిల్ లో పని చేస్తున్నారు. ఆయన ఆపిల్ హార్డ్ వేర్ డెవలప్‌మెంట్ లో కీలక పాత్ర పోషించారు. టెర్నస్ నిన్నటి వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హార్డ్ వేర్ ఇంజనీరింగ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన కొత్త సీఈఓ గా నియామకమయ్యారు.
AI పరంగా ఆపిల్ వెనుక బడిన పరిస్థితి ఉంది. అయితే, జాన్ టెర్నస్ నాయకత్వంలో ఆపిల్ మరింత ఇన్నోవేషన్ వైపు వెళ్లే అవకాశముంది. ఇది ఆపిల్ భవిష్యత్తును పూర్తిగా మార్చే టర్నింగ్ పాయింట్ కావచ్చని విశ్లేషకులు అంచనా వేసి చెబుతున్నారు.