FB Instagram Down and users reporting on downdetector
FB Instagram Down: మీ ఫోన్ లో ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ పనిచేయడం లేదా అయితే ఇది ఫోన్ ప్రాబ్లం అని పొరబడకండి. ఎందుకంటే, META యాజమాన్యంలోని ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ డౌన్ కావడమే ఇందుకు కారణం అని వెల్లడైంది. ఈ రెండు మెటా ప్లాట్ ఫామ్స్ కూడా డౌన్ అయినట్లు యూజర్లు ప్రముఖ సర్వీస్ డౌన్ రిపోర్ట్ ఆన్ లైన్ సర్వీస్ Downdetector లో రిపోర్ట్ చేస్తున్నారు. మేము ఈ నివేదిక అందించిన సమయానికి చాలా రిపోర్ట్ లు నమోదయ్యాయి.
మెటా యాజమాన్యంలో ఉన్న ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ పనిచేయడం కూడా డౌన్ అయ్యాయి. ఈరోజు రాత్రి 8 గంటల 15 నిమిషాల నుంచి ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ పనిచేయడం లేదని యూజర్లు డౌన్ డిటెక్టర్ లో రిపోర్ట్ నమోదు అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ రిపోర్ట్ కొద్దీ నిమిషాల్లో అమాంతం పెరిగింది. అంతేకాదు, ఇదే విషయాన్ని కొందరు యూజర్లు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X నుంచి కూడా షేర్ చేశారు.
ఇది మేజర్ సర్వీస్ డౌన్ కాదని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో 46 శాతం మంది యూజర్లు యాప్ లో, 20 శాతం మంది యూజర్లు సర్వర్ కనెక్షన్ లో మరియు 18 శాతం యూజర్లు ఫీడ్ లో సమస్యలు చూసినట్లు రిపోర్ట్ చేశారు.
ఈ సర్వీస్ డౌన్ గురించి మెటా ఇంకా ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ను విడుదల చేయలేదు. అయితే, ఇది రెగ్యులర్ సర్వీస్ ఇష్యు మాత్రమే అయ్యుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఇది అఫీషియల్ స్టేట్మెంట్ కాదని గమనించాలి. ఈ సర్వీస్ లోపం ఎక్కువ మంది యూజర్లు చవిచూడనట్లు కూడా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. కానీ, ఈ యాప్స్ లో ఫీడ్ రిఫ్రెష్ కాకపోవడం మరియు లాగిన్ సమస్య వంటి విషయాలు కొందరు యూజర్లను చికాకుకు గురి చేసినట్లు తెలిపారు.
Also Read : Amazon Great Freedom Sale: భారీ ఆఫర్స్ మరియు డీల్స్ తో అమెజాన్ సేల్ వచ్చింది.!
ప్రస్తుతం ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ లో ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా నడుస్తున్నాయి. డౌన్ డిక్టేటర్ లో కూడా ఈ యాప్స్ పై రిపోర్ట్ లు నమోదవ్వడం లేదు.