govo launches 5.2.4 True Dolby Atmos soundbar in india
ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ధరలో జబర్దస్త్ సౌండ్ బార్ లను అందిస్తున్న కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న GOVO లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ధరలో 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించినట్లు కంపెనీ చెబుతోంది. మరి ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
గోవో GoSurround 1000 Pro పేరుతో ఈ కొత్త సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది.ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి రూ. 23,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 22,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది.
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ కూడా రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించాయి. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి రూ. 22,999 ధరతో మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 21,999 ధరతో లభిస్తుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ లిస్ట్ చేసింది 750W సౌండ్ బార్ మరియు అమెజాన్ లిస్ట్ చేసింది 800W సౌండ్ బార్.
Also Read: OnePlus Nord CE6 మరియు CE6 Lite లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!
ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్స్ కలిగిన కొత్త డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు నాలుగు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ మొత్తం సెటప్ తో జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ టోటల్ 800W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ లేటెస్ట్ గోవో సౌండ్ బార్ 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ టచ్ కంట్రోల్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ బాస్ మరియు ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ అందిస్తుందని గోవో తెలిపింది.