OnePlus Nord CE6 మరియు CE6 Lite లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!

HIGHLIGHTS

జస్ట్ వారాల క్రితం వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వన్ ప్లస్

ఇదే సిరీస్ నుంచి OnePlus Nord CE6 మరియు CE6 Lite లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను క్రేజీ బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్

జస్ట్ వారాల క్రితం వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వన్ ప్లస్, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి OnePlus Nord CE6 మరియు CE6 Lite లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను క్రేజీ బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ గొప్పగా టీజింగ్ చేస్తోంది.

OnePlus Nord CE6 మరియు CE6 Lite : లాంచ్ డేట్

వన్ ప్లస్ నార్డ్ CE 6 మరియు నార్డ్ CE 6 లైట్ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 2026 మే 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదలవుతాయని వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ మాదిరిగానే ఈ రెండు ఫోన్లు కూడా అమెజాన్ ఇండియా మరియు వన్ ప్లస్ అఫీషియల్ సైట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తాయి.

OnePlus Nord CE6 : ఫీచర్స్

వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కీలక ఫీచర్లు కూడా లాంచ్ డేట్ తో పాటు రివీల్ చేసింది. వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్ మాదిరిగా వన్ ప్లస్ నార్డ్ 6 CE లో కూడా టచ్ రిఫ్లెక్స్ చిప్ ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ కలిగిన ఈ డ్యూయల్ చిప్ పవర్ తో 144Hz రిఫ్రెష్ రేట్ తో గేమింగ్ సపోర్ట్ చేస్తుందని వన్ ప్లస్ తెలిపింది.

గేమింగ్ కి తగిన డిస్ప్లే కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 3840Hz PMW డిమ్మింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా స్లిమ్ అండ్ కాంపాక్ట్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, ఈ ఫోన్ 10 గంటల నాన్ స్టాప్ BGMI ప్లే లేదా 30 గంటల యూట్యూబ్ ప్లే అందించే భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ బ్యాటరీతో పాటు 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా వన్ ప్లస్ ఈ ఫోన్ లో అందించినట్లు తెలిపింది. వన్ ప్లస్ నార్డ్ 6 CE స్మార్ట్ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K హై టైట్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది.

Also Read: Vivo T5 Pro 5G ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ అందుకోండి.!

వన్ ప్లస్ CE6 Lite : ఫీచర్స్

ఇక వన్ ప్లస్ CE6 లైట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 1 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7400 APEX చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ కలిగిన పవర్ ఫుల్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :