Tata Sky DTH తన సర్వీసులను అందించడం మొదలుపెట్టి 18 సంవత్సరాలు గడించింది మరియు ఈ పేరు అందరికి సుపరిచితమైనదే. అయితే, ఇప్పుడు కంపెనీ ఈ పేరును Tata Play గా మారుస్తున్నట్లు ప్రకటించింది. అయితే, కస్టమర్లకు ఏమిటి గుడ్ న్యూస్ అనుకుంటున్నారా?. టాటా ప్లే పెరుకు తగ్గట్టుగానే ప్లే DTH సర్వీస్ లతో పాటుగా OTT కంటెంట్ కలిగిన ప్లాన్ లతో పాటుగా కాంబో మరియు బండిల్ చేసిన సర్వీసులు యొక్క సమగ్ర జాబితాతో కొత్త పేరు నిన్న ప్రకటించబడింది.
Survey
✅ Thank you for completing the survey!
దీనికోసం చేసిన ప్రకటనలో టాటా ప్లే ఎకోసిస్టమ్‌కు నెట్‌ఫ్లిక్స్‌ను కూడా జోడించింది. ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులైన డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, హంగామా ప్లే, Eros Now, షెమరూమీ, Voot సెలెక్ట్, Voot కిడ్స్, Sony లైవ్ మరియు క్యూరియాసిటీ స్ట్రీమ్‌లను మిళితం చేస్తుంది. టాటా ప్లే దీనితో పాటుగా, టీవీ ఛానెల్‌లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌ల కలయికను అందించే Bige Combo ప్యాక్‌లను కూడా అందిస్తుంది.
ఇది మాత్రమే కాదు, డీయాక్టివేట్ చేయబడిన DTH కస్టమర్‌లు కూడా ఎలాంటి రీకనెక్షన్ ఛార్జీలు లేకుండా మరలా తిరిగి ప్లాట్‌ఫారమ్‌లో రీఛార్జ్ చేయడం ద్వారా మళ్లీ తిరిగి సర్వీసులను కొనసాగించవచ్చు. మొత్తంగా, టాటా ప్లే తో అన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్ లను కస్టమర్లు అందించవచ్చు.